Others

బెల్లం తింటున్నారా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లం రుచికి తియ్యగా వుంటుంది. ఇందులో పోషక పదార్థాలు లభిస్తాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, సెలీనియం, మాంగనీస్ లాంటి పోషక పదార్థాలెన్నో లభిస్తాయి. బెల్లం బంగారపు రంగులో వుంటుంది. ఇది ఎంత ముదురు రంగులో వుంటే పోషక పదార్థాలు అంత పుష్కలంగా లభిస్తాయి. క్యాండీలు, ఐస్‌క్రీములు, చాక్‌లెట్స్, చ్యవనప్రాశలాంటి వాటిల్లో బెల్లాన్ని వాడుతారు. అవాంఛిత రోమాలను తొలగించటానికి ఉపయోగించే వాక్సింగ్‌లో బెల్లం వాడబడుతోంది. ఇంటికి కావలసిన పచారీ సామానులను తెచ్చుకునే జాబితాలో బెల్లం ఉండవలసిందే. ఔషధపరంగా కూడా బెల్లానికి విలువ వుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని వృద్ధి చేస్తుంది. శక్తిని కలిగిస్తుంది. దాహాన్ని తీరుస్తుంది. జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. అలసటను తీరుస్తుంది. గుండెదడను తగ్గిస్తుంది. పేగులు ఆరోగ్యంగా వుండేలా చేస్తుంది. వేసవి తాపాన్ని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జలుబు, దగ్గుకు నివారణ కలిగిస్తుంది. వేసవిలో బెల్లం షర్బత్‌ను త్రాగితే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. రక్తలేమిని నివారిస్తుంది. పాలల్లో బెల్లాన్ని వేసుకుని త్రాగితే కీళ్ళు, పాదాలు, మడమ నొప్పులు తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. బెల్లాన్ని నువ్వులతో చేర్చి తిన్నట్లయితే శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలకు ఔషధంలా పనిచేస్తుంది. నువ్వులు, బెల్లాన్ని కలిపి పాలలో నూరి నుదుటిమీద పట్టులా వేస్తే మైగ్రెయిన్ నొప్పికి ఉపశమనం కలుగుతుంది. ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా లాంటి అనారోగ్యాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. బి.పిని నియంత్రణలో ఉంచుతుంది. బాలింతరాలు బెల్లంతో చేసిన పదార్థాలు తింటే చనుపాల ఉత్పత్తి పెరుగుతుంది. శరీరావయాల్లో చేరిన మలినాలను తొలగించటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. స్ర్తిలలో ఏర్పడే నెలసరి ఇబ్బందులను, సమస్యలను తొలగిస్తుంది. భుక్తాయాసంతో బాధపడేవారు ఓ బెల్లం ముక్కను చప్పరిస్తూంటే నివారణ కలుగుతుంది. శరీరంలో ఎండార్ఫిన్‌ను విడుదలవటానికి తోడ్పడుతుంది. సున్నం బెల్లం కలిపి నూరి కీళ్ళమీద పట్టు వేస్తే కీళ్ళనొప్పుల బాధ, వాపు తగ్గిపోతుంది.

- కె.నిర్మల