Others

సుమధుర రామాయణం.. (అయోధ్యా కాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

156.

నీలమేఘవర్ణు నిరుపమ సుందరు
కమలపత్ర నేత్రు కంబు కంఠు
సలలిత ముఖపద్ము సౌదర్య జితకాము
రాము జూసి కామపరవశమున

157. ఎవ్వడవు నీవు రాక్షస నిలయమైన
యాజన స్థానమున నేలయున్నవాడ
వసురరాజగు రావణుం డన్న నాకు
నిన్ను భర్తగ జేకొందు నందగాడ

158. అనుచు కామాంధయై తన్ను కదియవచ్చు
నానిశచరితో రాము డసురవనిత
ఈమె నా భార్య సవతి పోరుండు నీకు
గలడు తమ్ముడు సౌమిత్రి మారసముడు

159. అతని వరియింపు మిటలేదు వాని భార్య
అనిన నది లక్ష్మణుని జేరి కోర్కె దెల్ప
మొదటి నుండి నేనన్నకు సేవకుడను
నన్ను పెండ్లాడ దాసిగా నౌదునీవు

160. అగ్రజుడె నీకు తగిన వాడనుచు బల్క
నదియు యోచించి రాఘవు కడకు వచ్చి
దీని భక్షింతు నికనాకు సవతి పోరు
నుండదని సీత మీదికి నురక నపుడు

161. క్రోధమూర్తియై సౌమిత్రి ధరణి తనయ
పైకి నురికెడు నిశిచరిన్ బట్టి వేగ
ముక్కు చెవులను గోసి విరూపజేసె
దాని దుఃశ్శీలతకు నిదె తెరవటంచు

162. అదియు నార్చుచు ఖరదైత్యు చెంత కరుగ
సోదరిం జూచి యెవరమ్మ యింత ఘోర
ముగ పరాభవించిరి జెప్పు మిపుడె వాని
కాలసముడైన ఖండింతుగాక యనగ

163. గౌతమీ తీరమున పంచవటిని యున్న
దమ్ములిర్వురు మునివేషముల ధరించి
యున్నవారలు యొక సుందరియును గలదు
నామె చేయించె నాకీ పరాభవమ్ము

164. అనిన ఖరుడుగ్రుడై పదునాల్గు వేల
రజని చరసైన్యముతొ రామచంద్రు తోడ
కయ్య మొనరింప వచ్చిన యసురతతిని
రాముడేకైక వీరుడై రూపుమాపె

165. గగన వీధిని సురముని గణములెల్ల
ఆ మహా ధనుర్దురు పరాక్రమము జూచి
చకితులై మంగళాశీర్వచనముల రఘు
పతిని యభిషిక్తు జేసిరి భద్ర మనుచు

166. ధరణిపుత్రిక ఖర దూషణాది క్రూర
రాక్షసుల నెల్ల నసహాయ శూరుడౌచు
సంహరించిన భర్త నాలింగనమ్ము
జేసుకొనియె ప్రసన్నరాజాస్య యగుచు

167. ఖరుడు దూషణ త్రిశిరాది రజని చరులు
నిహతు లౌటచె దండకారణ్య మసుర
భయ రహితమయ్యె నచ్చటి తపసి వరులు
ప్రీతికొనియాడి దీవించ్రి రఘుకులేశు

168. నిజ జనస్థాన వాసులౌ రజని చరులు
వొక్క నరునిచె నిహతులై రనుచు తెలిసి
ఎవడురా వాడు కాల సర్పంబు నిట్లు
మేల్కొలిపెనని యాదశ మస్తకుండు

169. వాని కడతేర్చి వచ్చెద ననుచు లేచి
నట్టి దశకంఠు కడకు శూర్పణఖ వచ్చి
పిడుగువలె పడి రోదించు ననుజ జూచి
ఈ వికృత రూపమే విధిగల్గె నీకు
చెప్పుమన్న నన్న గనియా చుప్పనాతి

170. అన్న రావణ రాజ్యమందేమి జరుగు
చున్నదో విచారింపని ప్రభుని ప్రజలు
మన్ననను చేయరని యెరుగుదువు నీవు
చారచక్షువై రాజు చరించవలదె

టంగుటూరి మహాలక్ష్మి