Others

అసామాన్యమైన కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభయారణ్యం (కథలు)
-జి.లక్ష్మి
వెల: రూ.120
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
*
కథకులు కథను వివరించటంలో రెండు పద్ధతులు అవలంబిస్తారు. ‘విహంగ వీక్షణం’తో చెప్పదలచుకున్న తీరులో, వస్తువును, వస్తువు చుట్టూ ఉన్న పరిసరాలనీ స్థితిగతుల్నీ చెప్పుకుంటూ, తాము అనుకున్న గమ్యానికి పాఠకులను చేర్చటం ఒక రకం. కథావస్తువుని భూతద్దంలో చూపుతూ, వస్తువునీ, దాని నైసర్గిక స్థితిగతుల్ని మాత్రమే వివరిస్తూ, ఆసాంతమూ, ఆ వస్తువు గురించే తప్ప మరొకటి వివరించకపోవటం మరో రకం.
కథా రచయిత్రి, అనువాదకురాలు అయిన జి.లక్ష్మి గారు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైక్రో దృష్టితో చూస్తూ కథలల్లుతున్నారు. అల్బర్ట్ కామూ, అలిస్ మన్రో, ఫ్రాంజ్ కాఫ్కా లాంటి పాశ్చాత్య రచయితల్ని తెలుగువారికి పరిచయం చేశారు. ఇదువరలో ‘పూలు పూయని నేల’ అన్న కథా సంకలనాన్ని వెలువరించారు. ప్రస్తుత కథాసంకలనం ‘అభయారణ్యం’ రెండవది. ఇందులో, వివిధ ప్రముఖ పత్రికల ద్వారా వెలుగు చూసిన తన 20 కథల్ని చేర్చారు. ఈ కథలన్నీ వీరు 2014 నుంచి 2017 మధ్యకాలంలో రాశారు.
ఒక స్ర్తిగా, గృహిణిగా, సమాజంలో ఒక బాధ్యతాయుత వ్యక్తిగా, జీవన ప్రస్థానంలో స్ర్తికి మాత్రమే పరిమితమైన పరిధులను సమాజం విధిస్తున్న ఎల్లలను లోతైన దృష్టితో అర్థం చేసుకున్నారు.
మధ్యతరగతి, మధ్యవయస్కురాలైన ఒక స్ర్తి గృహిణిగా, ఉద్యోగినిగా, భార్యగా, తల్లిగా, అత్తగా, గృహ ఆర్థిక వ్యవహారాలు మేనేజ్‌చేసే ఆర్థికవేత్తగా, ఎలా నెట్టుకు వస్తున్నదో గమనించారు. మన ముందుంచుతున్నారు.
బ్రతుకైనా, కాంపౌండ్ గోడ అయినా బీటలు వారిన సమయాన ‘అతుకు’ అనివార్యం. ఒక్కసారి అతుకు పడిందంటే - ‘ఎంతయినా అతుకు అతుకే. ఈ విషయాన్ని విస్మరించలేము’ అంటారు ‘అతుకు’ కథలో. విడిపోయి మళ్లీ కలుసుకున్న సుమతి భాస్కరరావుల జీవితము, వాళ్ల కాంపౌండు గోడ రెండూ అంతే! ముప్పయి వారాల కాపురం అనే ‘నటన’ తర్వాత ‘రియలైజ్’ అయి, మనసు విప్పుకుని ఎదుటివారికి చెప్పుకుని ‘హాయి’ ఫీలవుతారు. నటిస్తూ ఎనన్నో రోజులు సంసారాన్ని లాక్కురాలేమని, ముసుగు తీసి అసలు ముఖంతోనే ఉండటం మేలనుకుంటారు.
కొడుకులు, కోడళ్లు, మనవలు - ఇందరి మధ్య ఉన్నా రీటయిర్డు ఉద్యోగి ఆదినారాయణ ఒంటరే! అయిదు నక్షత్రాల హాస్పిటల్‌కు నెలకోసారి ‘్ఛకప్’కు వెళ్లాలి. రిసెప్షన్ కౌంటర్ దగ్గర నుండీ, పరీక్షల వరకూ కష్టాలే! వయసుతో వచ్చిన వణుకు, బెరుకు, నెమ్మదితనం, అర్థం చేసుకోక గద్దించే, విసుగుకునే, ఇంటి వాళ్లు, హాస్పిటలు సిబ్బంది. అందరివీ ‘మూసిన తలుపుల’ జీవితాలు. వాళ్లకే వాళ్లు ఉపయోగపడని జీవితాలు. ఇక ఆదినారాయణ గారికి ఎలా సాయపడతారు? ‘క్లోజ్డ్ నెట్’ జీవితాల్లో వాళ్ల అవసరాల మటుకే అవకాశం. అమ్మా, నాన్నా, అక్కాచెల్లి - అన్నీ ఎక్స్‌ట్రా ‘బ్యాగేజీ’యే. వీళ్లపై ఆధారపడటం మానుకుని నిశ్చింత ఫీలవుతాడు ఆదినారాయణ ‘తోడు’లో.
బయట భర్త ఎంత సమర్థుడైనా, ఆమె దృష్టిలో ఆయన అసమర్థుడు! ఎక్కడైనా బలవంతులదే రాజ్యం. ఇదే ‘జీవన చిత్రం’ అంటుంది రచయిత్రి.
పెళ్లయాక ఆడపిల్ల తన కాళ్ల మీద తాను నిలబడాలి. అంతేకాని బేరుమనకూడదు. కలిసి ఉండాలి. లేదా విడివడాలి నో ‘్థర్డ్ ఆప్షన్’ అంటుందీ రచయిత్రి ఈ కథలో.
రానురాను దేనికీ, తీరికా, ఓపికా లేని బ్రతుకులవుతున్నాయి. ఏ భయమూ లేకుండా జీవిస్తూ, తాను సమూహాల్ని అభివృద్ధి చేసుకోవటానికి ‘అభయారణ్యాలు’ తోడ్పడుతాయి. తనదైన లోకంలో ఉండే సిద్దార్థా, మొదటి భార్య సహస్ర విడిపోతారు. విభ రెండో భార్య. ఆవిడతోనూ అంతే! సిద్దార్థకు ‘అభయారణ్యం’ అవసరం అనుకుంటాడు సిద్దూ తండ్రి. కథలోని మెలికలు మలుపులు పాఠకులకు అంత త్వరగా కొరుకుడు పడవు.
పిల్ల తరఫు వారి పెట్టుపోతలు పిల్లవాడి తరఫు వారికి నచ్చవు. ఇటు పిల్లవాడి తరఫు వాళ్లూ అంతే! అయితేనేం - ‘ఎండా వానా కలగలిసిన ఇంద్రధనస్సులా కన్నీళ్లతో నవ్వే పెళ్లికూతురుకు, పెళ్లికొడుకు వంశీకి ఇవన్నీ ‘జ్పజ్ఘ’! ‘పెళ్లంటే’లో.
పైవన్నీ, స్థాలీపులాక న్యాయంగా, రచయిత్రి వివరించిన తీరు చెప్పటమే - కాని ఏ కథకు ఆ కథే.. పాళాబంగారం. సిల్లీ పిల్లి గురించి (ఓ పిల్లి కథ), ఆ ఇంట్లోకి తొంగిచూస్తూ, మామిడిచెట్టు ఆ ఇంటి వాళ్ల కథ చెప్పినా (హోమం), ‘పరుసవేది’ లాంటి రాణిని భర్తగా పొందలేక పోయిన రఫీ దురదృష్టాన్ని వివరించినా, పనికిరాకున్నా, పడేయబుద్ధి కాని వస్తువులు, వాటి స్వంతదారు, అమ్మ గురించి (అమ్మా వాళ్ల ఇల్లు) చెప్పినా, లక్ష్మిగారి కథనం పాఠకుడిని ముగ్ధుడిని చేస్తుంది. సంసారంలో అన్నింటికన్నా హీనమైన ప్రాణి భార్య (పే.45) అనటం లక్ష్మిగారి నిస్పృహను ఓ గృహిణిగా తెలియజేస్తుందేమో కాని ఇది ‘యూనివర్సల్ ట్రూత్’ అని వారూ, అనుకుంటారనుకోను.
ఒక మంచి కథాసంకలనం చదివామన్న తృప్తి, ఆనందం తప్పక పాఠకుడికి కలిగించే సంకలనం - ‘అభయారణ్యం’.

-కూర చిదంబరం 863933 8675