Others

మానవత్వం - దివ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాళాల్లో ఏ మూలల్లోనో ఉంటారనే బోధన యుగయుగాల పర్యంతం, తరతరాల పర్యంతం కొనసాగింది. అదే నిజమని, ఎక్కడో వైకుంఠమనీ, సత్యలోకం అనీ, కైలాసమనీ మనమందరమూ విశ్వసిస్తున్న ఆ దైవం మనకు బాహ్యంలో ఎప్పుడూ లేడు - మనలోనే ఉన్నాడు! మనమే ఆ దైవం! ఓ మహాద్భుతమైన నిశ్శబ్ద భావస్రవంతే ఆ దైవం! ఆ నిశ్శబ్దంలో నిత్య జాగృతిలో మన అంతరంలోనే ఆ దివ్యత్వపు మహాప్రజ్ఞ స్థితమై ఉంది!
దేవుడెలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందు వెళ్లి నిలబడి చూడండి. ప్రతి మనిషీ దైవాన్ని దర్శించాలనే అభిలాషతో ఉంటాడు. ‘దేవుడు’ అనే మాట ఓ పదం కాదు. మనందరిలోనూ నెలకొన్న ఓ ‘హృదయభావం’ దేవుడంటే! దైవత్వాన్ని గురించిన మన అవగాహనా పరిధి ఎంతెంతగా పెరిగితే అంతంత మహోన్నతంగా అంతంత ‘మహదానందం’ మనల్ని ఆవహిస్తుంది. అదే దైవదర్పణం.
‘దేవుడు’ అనే మాట లింగభేదాలకు అతీతమైన ‘శబ్దం’. ‘మహాప్రజ్ఞ’ అనే ఆ మాటకు అర్థం. దేవుడు అంటే ‘ఉనికి’. మన జీవితాలకు మనమే సృష్టికర్తలం. మన జీవిత ప్రణాళిక మన స్వంతం కనుక మన జీవితానికి మనమే అధినేతలం. కనుక మన జీవన సర్వస్వపు ఉనికినే మనం ‘దివ్యత్వం’గా చెప్పుకోవచ్చు. దేవుడనేవాడు అన్యంగా ఎక్కడో లేడు. ‘పూర్ణానందమే దైవం’
ఎంతో విలువైన మన వ్యక్తిత్వపు ఉనికికీ, మనలో పరవళ్లు తొక్కుతున్న జీవశక్తికీ, మనల్నందరినీ సంఘటితంగా నిలబెట్టి ఉంచుతున్న అనుబంధానికీ దైవం అని పేరు. మనం జీవించి ఉన్నంతకాలం మన వర్తమానపు ఉనికే ‘ఆలోచన’. ఆలోచనే శాశ్వత జీవనం. ఆ ఉనికే సర్వస్వాన్నీ ప్రేమిస్తోంది, స్నేహం చేస్తోంది. ఉనికి అనే ఆ దివ్యశక్తే మన జీవితాన్ని నడిపిస్తుంది. జీవిత పరమానందం అదే - ఆ దివ్యత్వమే. అదే మన వారసత్వం. అదే మన పరమగమ్యం.
దైవత్వం అత్యున్నతంగా ప్రస్ఫుటమవుతోంది ఎక్కడో తెలుసా? ఆలోచనలోనే! ప్రజ్ఞా పరాకాష్టలో సర్వస్వాన్నీ - ఇప్పుడుంటున్న వాటినీ, ఇక ముందు రాబోయే వాటినీ కూడా సృష్టించేది ఆలోచనే అని తెలుస్తుంది. ఈ ఆలోచన అన్న పదార్థం నుంచే సర్వస్వమూ సృజింపబడుతుంది. ఇప్పుడు మన చుట్టూ, ఈ ప్రపంచంలో, ఈ విశ్వసృష్టిలో ఉంటున్నవన్నీ ఆరంభంలో ఆలోచనలో ఉన్నవే.
‘ఆ మహాప్రజ్ఞే ఆలోచన - అదే దివ్యమానసం’
విభిన్న నిర్దుష్ట స్వరూపాలతో విస్తృతంగా వ్యక్తీకరింపబడుతున్న సంభవాలన్నింటినీ అలా నిలిపి ఉంచుతున్న మహాశక్తి ఏమిటంటే అదీ ఆలోచనే! ‘ఆలోచన’ అన్న పేరున్న విశ్వపు ‘మహాజిగురు ప్రేమ’ సర్వస్వాన్నీ ఆలోచనలోంచి ఆవిర్భజేసిందీ, ఆవిర్భజింపజేసేది ఆ దివ్య ప్రేమే.
మానవుడు వౌలికంగా దైవమేనన్న సత్యాన్ని మనం గ్రహించగలగాలి. దేవుడు పరిపూర్ణుడు. ఏ తీర్పులనూ చేయని కరుణామూర్తి - ప్రేమమూర్తి - స్నేహస్ఫూర్తి. మరేదీ కానిది, సర్వస్వం అయిన ఉనికి సామ్రాజ్యమే ఆ దేవుడు. అదే మన జీవశక్తి. మనం చరించే క్షేత్రమే అది. మన శ్వాసే అది. మన దేహఛాయా, మన కంటి వెలుగూ, మన మృదుస్పర్శా ఆ దైవమే. మనం జీవిస్తున్న ప్రతి క్షణంలోనూ, మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ ఆ దైవమే ఉంది - ఆ దివ్యత్వమే ఉంది.
*

-మారం శివప్రసాద్.. 9618306173