Others

జగన్నందిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో
భావకవితా వికాసం
ప్రణయం ప్రకృతి ప్రశంస మహిళా కవితావళి
(1920-43), 1948-1966)
సంపాదకుడు:
సామిడి జగన్‌రెడ్డి
(పరిశోధన, సేకరణ,
సంకలనం)
వెల: రూ.350
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడెమీ
కళాభవన్,
రవీంద్రభారతి,
హైదరాబాద్-4
*
నందిని సిధారెడ్డి ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ చైర్‌మన్’. సామిడి జగన్‌రెడ్డి ‘రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెలువడే తెలంగాణ ప్రనుత్వ మాసపత్రికలో అసోసియేట్ ఎడిటర్. వీరి ఆలోచన, ఆచరణ కలసిన రూపమే ‘తెలంగాణలో భావ కవితా వికాసం’.
‘ప్రణయ భావం - ప్రకృతి భావం - ప్రశంసా భావం - మహిళా కవితావళి భావం’ అన్నీ కలసిన వికాస పరాకాష్ఠ ఈ ‘కవితా వికాసం’.
తెలంగాణమున ససజ కవులెక్కుడు. భావమును నిర్మించునప్పుడు భాషను వ్యాకరణ పీడితం కానివ్వని ఉదారులు. అక్కరములు అలవాటును పరచిన రహదారులు. కొన్ని పదుల సంవత్సరముల వెనుకనే ఇంతటి మెత్తని పదముల నేరికొని ఆ పోహణింపుతో కైతలల్ల గలిగిన నేర్పు నొనగూర్చుకున్న వారు. కాల గర్భమున కలిసిపోకుండ కాంతిపీఠమెక్కినారు.
‘తెలుగు భాషా సంస్కృతుల మూలభూమి తెలంగాణ. తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం సమున్నతంగా కృషి చేసిన మాగాణం తెలంగాణం. యుగాలుగా, శతాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రాణ సమానంగా తెలుగు తేజస్సును కమ్మదనాన్ని కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర తెలంగాణది’ అని నందిని వారు ముందు మాటలో సెలవిచ్చారు. తద్వ్యతిరేకంగా సామిడి వారు తమ ప్రామిడినిలా చెప్పుకున్నారు. ‘హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన తెలంగాణ సాంతం అంధకారమని ఫ్యూడల్ సంస్కృతి (దేశమంతా వున్నట్లే ఇక్కడ కూడా వున్నది) అని, ఆధునిక కవిత్వం రాలేదని మధ్యతరగతి ఆవిర్భావం జరగలేదని ఒక వాదన ఏనాటి నుంచో వున్నది. ఇందుకు కారణం వారికి స్థానిక చారిత్రిక రాజకీయ పరిణామాలపై సరియైన అంచనా. అధ్యయనం లేకపోవచ్చని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం కూడా ఇదే రకరకాల రూపాలలో ఈ వాదనను వామపక్ష వాదుల సహా కొందరు సాంప్రదాయ వాదులు ముందుకు తెస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తెలంగాణా వాదులైన కొందరు గతంలో పుస్తకాలు కూడా వెలువరించారు. ఒకరిద్దరికి ఈ తరహా కవిత్వం వచ్చిందని తెలిసినా దానిని విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు నాకు తెలుసు కానీ ఇక్కడది చర్చనీయాంశం కాదు.’
హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ వుందని ఒకచోట, తెలంగాణలో హైదరాబాద్ వుందని మరో చోట వ్రాసిన జగన్‌రెడ్డి గారికి ఏది ఎక్కడ ఉందో ముందు తెలియటం, తెలియని నాబోంట్లకు తెలియచెప్పటానికైనా అవసరం. ఇక కవిత్వ తత్త్వ విచారంలోకి వెడితే...
ప్రణయం - ప్రకృతి - ప్రశంస - మహిళా కవితావళి అని నాలుగు వింగడించని కలగాపులగపు కలనేతలున్నాయి. కనుక్కోవటం కష్టం. వెతికి పట్టుకోవాలి. పైగా అట్ట మీద సూచించిన (కాలగత సంవత్సరాలలో) దానికి లోన రెండవ పొరటలో ప్రకటించిన దానికి తేడా ఉంది మధ్యలో 6-7 సంవత్సరాల నిశ్శబ్ద వ్యవధానమూ వుంది. మొదటే చెప్పినట్లు కవిత్వరీతుల్ని వింగడించి ఉంటే బాగుండేది. ఈ కవులలో చాలామంది చాలామందికి తెలియకపోవటమనే విషయాన్ని అంగీకరిస్తే అది తెలంగాణ భాషా సంస్కృతుల్ని చిన్నబుచ్చినట్లు కాదు. సుప్రసన్న, దాశరథి, సినారె, సురవరం, బూర్గుల, కాళోజి, రాయప్రోలు మొ.వారంతా చాలామందికి తెలిసుండటం అంటే వారివారి సాహిత్య కృషీవలత్వం అటువంటిదే.
జగన్‌రెడ్డిగారు శబ్ద రూపాన్ని సాకల్యంగా తెలుసుకొని వున్నట్లైతే సంకలనం సుష్ఠుగా పరిష్కరించబడి యుండేది. అది అచ్చుతప్పో - అపశబ్ద ప్రయోగమో తెలియని స్థితిలో పాఠకుని పడవేయటం సంపాదకుని సంవిత్సంపద అనిపించుకోదు. ఇది సంకలనకర్త మఱకువని తెలియచేస్తుంది.
ఈ సంకలనంలో చోటు చేసుకున్న కవుల వివరణలను చివర్లో ప్రస్తావించి వున్నట్లైతే మరింత శోభగా వుండేది. పూర్వ తెలంగాణ కవుల అపూర్వ కావ్యసృష్టిని, ఇప్పుడు గమనించిన పాఠకులకు తృప్తి కలిగేది. ఆరువందల పుటలకు పైగానున్న ఈ కవితా వికాసాన్ని వెలువరించటంలో జగన్‌రెడ్డి గారు చెప్పవీలులేని శ్రమనే పడి ఉండవచ్చు గాక - అయితే ఆయన పూటపూటలో కనిపించే విషయ దోషాల్ని ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. జాతులున్నాయి. ఉపజాతులున్నాయి. గేయాలున్నాయి. రచన కవితలున్నాయి.
ఇంత వైవిధ్యమున్న ఈ కవితా వికాసానికి సారధ్యం వహించిన సామిడి జగన్‌రెడ్డిగారు తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, చరిత్రల అధ్యయనమే ఊపిరిగా జీవిస్తున్నవారు. పైగా మంచి పరిశోధకుడు. ఇంత శ్రమ మరింత శ్రద్ధగా సాగినట్లైతే ‘తెలంగాణ భావకవితా వికాసం’ మరింతగా గోసెక్కించబడేది. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచురణ 11గా ఆవిర్భవించిన ఈ పొత్తం మొత్తం తెలంగాణ గొజ్జగి నీటి తేటతావుల్ని విరజిమ్మాలి కదా! తప్పకుండా అలానే జరగాలని ఆశిద్దాం.

-సాంధ్యశ్రీ