Others

సరళ వ్యాఖ్యానంతో భగవద్గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీత
తెలుగు ప్రతిపదార్థ
తాత్పర్య వ్యాఖ్యానం
-డా.రామవరపు శరత్‌బాబు
వెల: రూ.500
ప్రతులకు: రచయిత
జి-1, 46-18-8
మండవారిపేట
దొండపర్తి, విశాఖ-530016.
*
హిందువుల పవిత్ర గ్రంథములలో భగవద్గీతకు సమున్నత స్థానం ఉంది. దీనికే వాసుదేవ గీత అని మరొక పేరు. వ్యాస భారతములో యుద్ధ పంచకము ప్రారంభం కావటానికి ముందు అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించిన ఆధ్యాత్మిక గ్రంథమిది. ఇందులో 18 అధ్యాయాలున్నాయి. ‘్ధర్మక్షేత్రే కురుక్షేత్రే’ శ్లోకంతో గీతోపదేశం మొదలవుతుంది. ధర్మ శబ్దమే భారతీయ సంస్కృతికి మూలము. జీవన సమరంలో క్లైబ్యదశలో ఉన్న పార్థునికి అనగా నరునికి దేవుడిచ్చిన ప్రోత్సాహమే గీతాసారము. భగవద్గీతకు లోగడ కొన్ని వందల వ్యాఖ్యానాలు వచ్చాయి. ముఖ్యంగా ద్వైతాద్వైత విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానాలు ఆయా మతాచార్యులు రచించారు. ఐతే గీతాసారాంశం తెలుసుకోదలచిన వారికి శ్లోకమునకు అర్థము, తాత్పర్యము సరళమైన తెలుగులో మూలాతిరిక్తం కాకుండా గ్రహించే ప్రయత్నం కొందరు చేయకపోలేదు. ఇటీవల డా.రామవరపు శరత్‌బాబుగారు ఈ ప్రయత్నాన్ని చేశారు. వీరు పేరెన్నికగన్న సంస్కృత విద్వాంసులు. భారత భాగవత రామాయణములను తెలుగులోనికి తెచ్చారు. భాస నాటక చక్రము రచించారు. తెలుగులోని శ్రీనాథ మహాకవి రచించిన శైవ ప్రాధాన్యం కలిగిన పంచకమును సామాన్యుల కోసం రచించారు. ఇప్పుడీ భగవద్గీతకు చిత్కళా వ్యాఖ్యోపేయంగా పాఠకులకు అందించారు. ఈ గ్రంథం వారి అర్ధాంగి శ్రీమతి విజయలక్ష్మి గారి స్మృతికి అంకితం చేశారు. ఇది రామవరపువారి ఆనంద లహరి సీరిస్‌లో ఆరవ కుసుమము. దీనిని రచించటంలో ప్రచురించటంతో వారికి స్ఫూర్తినిచ్చిన గురుపరంపరను ముందుగా స్మరించుకున్నారు. ఇక వ్యాఖ్యానం విషయానికివస్తే పద విభాగం, అన్వయం, ప్రతిపదార్థం, తాత్పర్యం ఇలా సాగింది. అంటే శ్లోకం సామాన్య పాఠకునికి సరళాతిసరళం చేయబడిందని వేరుగా చెప్పనక్కరలేదు. ఇవి ఏ సంస్కృత పండితుడైనా వ్రాయగలడు. కాని చిత్కళా వ్యాఖ్య మాత్రం రామవరపు వారి స్వీయ ప్రతిభాద్యోతకము. అంటే గీతాపద ప్రయోగంలోని ఔచిత్యాన్ని సార్థక్యాన్ని చాలా లోతుగా అనే్వషిచి వ్యాఖ్యానించారు. ఇటీవల వచ్చిన గీతా వ్యాఖ్యానాలన్నింటిలోనికి ఇది తలమానికమైనదని చెప్పవచ్చు. రామవరపు వారు ‘తత్ = పరమాత్మ కర్త - త్వం = నీవు - జీవునివి - కర్మ - అసి = క్రియ - ఇదే తత్వమః (202వ పుట.) ఇలా వినూత్న పద్ధతిలో సరళంగా వ్యాఖ్యానం సాగింది. 504వ పుటలో పురుషకారానికి వ్యాఖ్యాత ప్రాధాన్యాన్ని కల్పించారు. అది 99పాళ్లు అని వారి దృక్పథం. ‘యత్నమే దైవము స్వయత్నమే దైవము’ అని సమర్థ రామదాస స్వామి బోధించింది ఇదే. అంటే భగవద్గీత కేవలము ముక్షువులకు మాత్రమేకాక జీవన సమరంలో నిలబడిన ప్రతి నరునికీ కర్తవ్య బోధ చేస్తుందని పిండితార్థం. రామవరపు వారు బహుశా భార్యావియోగ దశలో దుఃఖ భారోపశమనార్థం ఈ గ్రంథ రచనకు పూనుకొని ఉంటారు. వారి ప్రయత్నము సఫలీకృతమైంది. గీతాఫలం తెలుగువారికి అందింది. అందుకు శరత్ పూర్ణిమను అభినందిద్దాం.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్