Others

అదే ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ బోధనలోకి మీరు పూనికతో ప్రవేశించితే అది మీకు ‘మహానందాన్ని’ మిగులుస్తుంది. ప్రతి సంభవంలోంచి, అనుభూతిలోంచి మీరు ఎదిగి మరింత బలవంతులుతూ ఉంటారు; అది ఆత్మబలం; మరింత తేలిక పడుతూ ఉంటారు; అది మనోబలం; మరింత తేలికవుతూ ఉంటారు; అది బుద్ధిబలం; మరింత ప్రశాంతతను సంచరించుకుంటూ ఉంటారు; అది చిత్తస్థైర్యం; మరింత సాధారణ వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడుతూ ఉంటారు; అదే ఆనందం! అదే సాధారణ స్థితి!
ఆ సాధారణత్వమే అత్యంత గొప్పది! ఎవరైతే ఎక్స్‌ట్రా ఆర్డినరీ స్థితిని, అసాధారణ స్థితిని అధిగమిస్తారో ఆ మహా గొప్పవారినే ‘ఏన్ ఆర్డినరీ మేన్’ అంటారు. ‘బ్రహ్మర్షి పత్రీజీ’ అలాగే ఉంటారు. యేసు క్రీస్తు అలాగే ఉండేవాడు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, చంద్రశేఖర సరస్వతి (కంచి పరమాచార్య) అలాగే ఉండేవారు.
‘జడ్జ్ ఎ నాట్’ అన్నాడు జీసస్. ఒక వెలయాలిని జీసస్ వద్దకు తీసుకుని వచ్చారు కొందరు అతి మేధావులు. ఆ వెలయాలిని వేలెత్తి చూపుతూ ఈమె అనునిత్యం పాపం చేస్తున్నది - ఈమెను మీరు శిక్షించాలి అని అడిగారు. వారి ఉద్దేశం జీసస్‌ను అప్రతిష్టపాలు చేయాలని శిక్షిస్తే జీసస్‌కు ఏ మాత్రం కరుణ లేదు అని, శిక్షించకోతే జీసస్‌కు ధర్మం తెలియదనీ - ఎలాగైనా జీసస్‌ను అభాసుపాలు చేయాలని వారు వచ్చారు.
మహనీయులు ఘటనాఘటన సమర్థులు - ఎదుటివారిని బయటా లోపల అంచనా వేయగల శక్తవంతులై ఉంటారు. ఎదుటివారిని ఇట్టే చదివేస్తారు. జీసస్ అలాంటివారే! సరే! మీరంతా ఈ వనిత తప్పు చేసింది, శిక్షించాలి అంటున్నారు - అలాగే చేద్దాం. అయితే మీలో పాపం చెయ్యనివారు ఎవరో వచ్చి ఈమెను శిక్షించవచ్చు అన్నారు అందరివైపూ చూస్తూ. అంతే! అందరూ పారిపోయాడు జీసస్ ఎదుట నిలబడలేక. ఎందుకంటే వాళ్లలో పాపం చెయ్యనివారు లేరు.
దోషిగా ఆరోపింపబడిన ఆ ‘స్ర్తి’ మాత్రం జీసస్ వైపు దీనంగా చూస్తూ ‘స్వామీ! నేను నిజంగానే తప్పు చేస్తున్నాను. నా జీవనానికి అదొక్కటే ఆధారం. వేరే గతిలేక నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ వ్యభిచార వృత్తిని ఆశ్రయించవలసి వచ్చింది. నన్ను కఠినంగా శిక్షించండి గురువర్యా అంది ఎంతో వినయంగా!
అందుకు జీసస్ అన్నారు కదా - అమ్మా! పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నా తండ్రి దృష్టిలో నువ్వు చేసింది పాపం కానే కాదు’ ఆమెను ఓదార్చాడు.
ఇది మనకు తెలిసిన కథే కావచ్చు. ఇందులోని విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మనిషిని మనిషి ప్రేమించని, మనిషి మరో మనిషికి బానిసగా ఉండే కాలంలో దయా కరుణలకు ఏ మాత్రం విలువా గౌరవం లేని కాలంలో భూమి మీద జీసస్ జీవించాడు. అయితే జీసస్ ప్రేమను అత్యున్నత శిఖరం మీద ప్రతిష్ఠించాడు. అందరినీ ప్రేమించాడు! కరుణాభావం వల్లే ఆయన రక్షకుడిగా కీర్తింపబడ్డాడు. ప్రేమ కరువై ప్రజలు అలమటిస్తున్న రోజుల్లో అందరినీ దయతో చూసి ప్రజలకు అత్యంత చేరువయ్యాడు.
దైవత్వం మనలోనే ఉందనీ, సమస్త జీవరాసులనూ సమానంగా చూసి స్నేహం చేయాలనీ ఆ నిర్మల హృదయుడు బోధించాడు.
దేవుడంటే ఛండశాసనుడు కాడనీ, తప్పులెంచి శిక్షించేవాడు కాడనీ, దేవుని రాజ్యం మనలోనే ఉందనీ, అత్యంత కరుణామయమైన దైవ హృదయం కలవాడే గొప్పవాడనీ, అతడే సర్వ ప్రేమికుడనీ బోధించాడు. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న దైవ రాజ్యాన్ని తెలుసుకుని అందరూ అందరితో మిత్రభావాన్ని పెంపొందించుకోవాలని బోధించాడు యేసుక్రీస్తు.

-మారం శివప్రసాద్.. 9618306173