Others

శ్రేయోదాయకమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో కర్మాచరణ ఒక భాగం. దేహయాత్రను కొనసాగించుటకు కర్మ మానవుని కర్తవ్యము. ఈ కర్మాచరణ శాస్త్ర విహితమైనదిగాండవలెనని మన సనాతనం ఉద్బోధిస్తోంది. శాస్త్ర సహిత మరియ విహితమైన పనియే కర్మ. శాస్తమ్రు నిషేధించిన కర్మలు వికర్మలు. ఇక ఏ పని చేయక సోమరిగా ఉండుటఅకర్మ అని విశే్లషించవచ్చు. శ్రీ శంకరులు ఈ అకర్మ అనెడి చర్వాకమును తీవ్రంగా ఖండించారు.
అకర్మ మానవ కళ్యాణానికి విరుద్ధము. శాస్త్ర సహితమైన కర్మలు ధర్మానుగుణములై ఉండుననుటలవో సందేహం లేదు. కుటుంబ వ్యవస్థ, సమాజ శ్రేయస్సులను నిత్య నూతనము చేయునవే శాస్తస్రహిత కర్మలు. ఇవి వర్ణాశ్రమాలకు యోగ్యమైన కర్మలు కనుక ఫలసిద్ధిని పొందుతాయి. ఇక్కడ ఫలసిద్ధి అనగా ధర్మరక్షణ. ఏ యుగమునందైనా స్వధర్మాచరణయే సత్కర్మ అని చెప్పవచ్చు. పరధర్మము భయానకమే కాక అది నరకమునకుదారితీయునని గీతాచార్యుడు పలికినాడు. ధర్మము యొక్క బాహ్యరూపములో మార్పు ఉండవచ్చునుగాని దాని మూలము మాత్రము యుగయుగాన ఒక్కటిగానే నిలిచియుండును.మన వృత్తి, ప్రవృత్తులు ఇతరులను పీడించేవిగా ఉండకుండుటయే ధర్మపథము. ఈ పథము యుగధర్మమునకు ఆటంకము కలిగించకుండా ముందుకు సాగవలెను. ఒక జాతి యొక్క సంస్కృతిని పెంపొందించేదే ధర్మము.
పరంపరానుగతంగా వచ్చే నియమాలను కొనసాగించేదే ధర్మము. ఋషిప్రోక్తమయిన వేద వాఙ్మయమునుండి ఈ ధర్మపథమును మనకందించిన సనాతనము నిత్య నూతనము. ధర్మరక్షణయే శాస్త్ర విహిత కర్తవ్యము. ధనుర్బాణాలను జారవిడిచి అశక్తుడయిన అర్జునునకు యుద్ధమనే కర్మపథాన్ని చూపి ధర్మసంస్థాపన చేయించాడు భగవానుడు.
అహింస సజ్జనులకు స్వధర్మము. కానీ దేశ రణలో సైనికులకు హింస స్వధర్మమలు. వీరమరణము పరమ ధర్మము. తన జాతిని, దేశాన్ని కాపాడుకొనే యజ్ఞంలో హింస ఒక పూర్ణాహుతి. విజయమనే కర్మఫలం ఏ ఒక్కరిచే, ఏ ఒక్కరి కోసమో లభించినది కదా. అది ఒక ఫలాపేక్ష రహిత ధర్మఫలం. ధర్మ సంస్థాపన కొరకుచేసిన ఒక మహోన్నత సత్కర్మ ఫలితం.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు