Others

ప్రభావం కొంతసేపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడుస్తున్న కాలపు అడుగుజాడల్లో
నిన్ననైనా నేడైనా ఆఖరుకు రేపైనా
దేని ప్రభావమైనా కొంత కాలమే
గడిచిన కాలపుగురించి సానుభూతి
గడుస్తున్న కాలపు సణుగుడు
రాబోతున్న కాలపు అలజడి
ఏదైనా కొంతసేపే
అంతా సర్ధుకున్నాకా, అంతా సమసిపోయాక
మళ్లీ నిర్మలంగా, నిశ్చలంగా, గంభీరంగా
కాలం కదులుతూనే ఉంటుంది
కదులుతున్న అలలోనైనా
గిరాటేసిన రాయి విసురు తగ్గేదాకా
గడబిడ అల్లకల్లోలం
విసురు తగ్గితే
అలలన్నీ తీరం చేరేలోపే
అణగిపోతాయి

-చరణశ్రీ