Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయంలో మనమేమీ మైళ్లకు మైళ్లు తవ్వకాలు చేసి, చారిత్రక సాక్ష్యాలకోసం కసరత్తులు చేయనక్కరలేదు. ప్రపంచం మొత్తంమీద అతి పురాతన సాహిత్యంగా గుర్తింపు పొందిన వేదం ఏం చెపుతుందో వింటే చాలు.
ఆకారాన్ని ప్రత్యక్షంగా చూసినా, లేక ఊహాత్మకంగా మనసులో భావించినా కూడా, ఆ క్షణంలో మన మనస్సు గుర్రం యొక్క ఆకారంతో ముద్రితమై, ఒక ప్రకంపనకు లోనవుతుంది. ఆ ప్రకంపన శరీరంలో వున్న ‘శరీరాగ్ని’ని ఉత్తేజపరుస్తుంది. (శరీరాగ్ని అనే వైదిక సాంకేతిక పదానికి ఈనాటి పరిభాషలో శారీరక విద్యుత్తరంగాలు అని అర్థం చెప్పుకోవాలి). ఈ అగ్ని శరీరంలో గల వాయువును వ్యాకోచింపచేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగితే వాయువ్యాకోచం సహజమే కదా! ఈ వాయువు సూక్ష్మవాయువు గనుక, దీనిలో గలిగే వ్యాకోచం క్రియారూపంగా మాత్రమే వ్యక్తమవుతుంది. వ్యాకోచాన్ని పొందిన శరీర వాయువు తనతో ముడిబడి వున్న ప్రాణశక్తిని స్పందింపజేస్తుంది. ఈ ప్రాణశక్తి మూలాధారంలో నిద్రితమై వుంటుంది. ఇది వ్యాకోచిత వాయు ప్రేరితమై చలనం పొందగానే, భావరూపంలో వున్న శారీరక విద్యుత్తరంగాలు శబ్ద విద్యుత్తరంగాలుగా పరివర్తన చెందుతాయి. మూలాధారంలో ప్రారంభమైన ఈ శబ్ద విద్యుత్తరంగాలు హృదయ స్థానాన్ని చేరి అక్కడ సుడులు తిరుగుతాయి. ఆ హృదయంలో వున్న సంస్కారాలు ఆ సూక్ష్మ వాయువును ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే, హృదయం అనేక పూర్వ కర్మార్జిత సంస్కారాలకు స్థానం కదా! ఆ సంస్కారాల ప్రభావంవల్ల అక్కడి శబ్ద విద్యుత్తరంగాలు ఒక మంద్ర స్వరాన్ని జనింపజేస్తాయి.
మారుతస్తూరసి చరన్ - మంద్రం జనయతి స్వరం
మంద్ర అంటే - గంభీరం. అంటే బయటకు వినిపించనిది అని ఒక అర్థం. సంగీతంలో నాదానికి మంద్ర మధ్యమ తారాస్థాయిలని మూడు స్థాయిలున్నాయి. హృదయంలో పుట్టే స్వరానికి- ఈ రెండు లక్షణాలూ వున్నాయి. అక్కడనుంచీ ఆ తరంగాలు పైకి ప్రయాణం చేసి శిరస్సును తాకి, వెనక్కి పరావర్తనం చెంది, ముఖంలో ప్రవేశిస్తాయి.
ఆ సమయానికి, శరీర వాయువు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని వుంటుంది. అక్కడ ఈ రెండూ సమ్మిళితమై, నోటి అంతర్భాగంలో వివిధ స్థానాలలో తాకిడి పొందుతాయి. తత్ఫలితంగా వివిధ వర్ణాల ధ్వనులను ఉద్భవింపజేస్తాయి. ‘వ్యాస శిక్ష’ అనే గ్రంథంలో వ్యాసభగవానుడు చెప్పిన శబ్దోత్పత్తికి వెనుక గల వైజ్ఞానిక ప్రక్రియ ఇది.
కాగా దేవత అనే భావాత్మక ద్రవ్యాన్ని ఒక భక్తుడు మనస్సులో భావన చేసినపుడు, భావించబడిన ఆ పదార్థంలో గల శక్తివిశేషాన్ని బట్టి, భావించే వ్యక్తి యొక్క మూలాధారంలో వివిధ శబ్ద విద్యుత్ తరంగాలు ఉత్పన్నమై, అతని విశుద్ధచక్రంలో ప్రస్ఫుట మంత్రాక్షరాలుగా వ్యక్తమవుతాయి. ఈ విధంగా చూచినపుడు భావించిన దేవతకు, ఉద్భవించిన వర్ణ పరంపరకు, అవినాభావ సంబంధం వున్నదని అర్థవౌతుంది. కనుక ఈ మంత్రాక్షరాలే ఆ దేవత యొక్క అసలైన ఆకారమని వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. అయితే, ఈ రకమైన మంత్రాక్షరమయమైన దేవతా స్వరూపాన్ని దర్శించటానికి యోగము చేత పరిశుద్ధమైన నిశ్చల హృదయం కావాలి. అలాంటి పవిత్ర హృదయం కలవారే మంత్రద్రష్టలు.
ఓం - గం - లం - గ్లౌం
అలాంటి మంత్రద్రష్టలు గణేశ తత్త్వాన్ని గురించి భావించినపుడు, వారికి స్ఫురించిన ప్రథమ వర్ణం ఓంకారం. నోటితో పలికే ధ్వనికి, రేఖారూపంగా ఇచ్చే సంకేతమే మన లిపి. ఈ లిపిని సంకేతంగా వుంచే ప్రయత్నం దేవభాష అయిన సంస్కృత లిపిలో మాత్రమే జరిగింది. సంస్కృత వర్ణమాల ప్రకారం ప్రణవాన్ని వ్రాయాలి. కానీ ప్రణవానికి ప్రత్యేకమైన సంకేతం రేఖ. దీనిలో క్రింది అర్థచంద్రాకారం గణపతి బొజ్జగాను, కుడిపక్కనగల కొమ్ము ఏనుగు తొండంగానూ, రూపకల్పన కాగా గజాననుడి స్వరూపం మనకు లభిస్తోంది.
మంత్ర ద్రష్టలకు కనిపించిన మరో గణపతి బీజాక్షరం ‘గం’. దీనిని సంస్కృతంలో గ అని వ్రాస్తారు. ఇది ఏనుగు తొండానికి ప్రక్కన వంటరిదంతం వున్నట్టు కనిపిస్తుంది. దీనివల్లే ఏకదంత గణపతి రూపం ఏర్పడింది.
ఇక మరో బీజాక్షరం ‘లం’. ఇది మూలాధార చక్రం యొక్క బీజాక్షరం. ఇది పొట్టిగా, లావుగా వుండే రూపాన్ని గుర్తుచేస్తుంది. అందువల్లే గణపతికి ‘వామనః’ అని పేరు వచ్చింది. ఇది సాక్షాత్తుగా గణపతి బీజాక్షరం కాకపోయినా, గకార ఔకారములతో కలిసి ‘గ్లౌం’ అనే రూపాన్ని పొంది గణపతి బీజాక్షరవౌతోంది. ఇది గణపతి యొక్క ఏనుగు తొండాన్ని, వామనరూపాన్ని, ఏకదంతాన్ని మాత్రమేగాక నెత్తిమీదగల రెండు గీతలవల్ల కిరీటాన్ని కూడా స్ఫురింపజేసి, ఆయన యొక్క అధిపతిత్త్వాన్ని వ్యక్తం చేస్తోంది.
అక్షరము- రంగు-
ఈ విధంగా మంత్రద్రష్టలు ఏ వర్ణాలను తమ తపస్సమాధిలో దర్శించారో, వాటికి అనుగుణమైన రూపమే ఈ దేవతకు వుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి.
సంస్కృతంలో వర్ణమనే పదానికి అక్షరమని, రంగని, రెండర్థాలున్నాయి. ప్రతి దేవతకూ వేరువేరు బీజాక్షరాలు వున్నట్లే, వేరు వేరు కాంతి తరంగాలు కూడా వున్నాయి. ఎందుకంటే రూపం లేని దైవం రూపాన్ని స్వీకరించినప్పుడు రెండు రకాల రూపాలను స్వీకరిస్తాడు 1) చెవికి వినిపించే రూపం. బీజాక్షరం. 2) కంటికి కనిపించే రూపం. తేజస్సు. ఇదే రంగు. ఆ అక్షరమూ, ఈ రంగూ కూడా కలిపి వర్ణం. తేజస్సు మరింత స్థూలమైతే అది కంటికి కనబడే ఆకారం.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి