Others

ఆందోళనాంధ్రప్రదేశ్ పంచాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదాయం: అప్పు దొరికిన మేరకు
వ్యయం: అంతకు మించి, ఎన్నో రెట్లు
రాజ పూజ్యం: బొత్తిగా పూజ్యం
అవమానం: కొలమానం లేదు, అనుమానం లేదు. ఘనం.
విలంబ నామ సంవత్సరాన్ని కంగాళీ నామ సంవత్సరం అనుకున్నా పరవాలేదు ఆంధ్రప్రదేశ్‌వరకూ. అంతా ఆందోళనకరం. ‘చంద్ర’నిప్పులు, వేడి ‘పవనాలు’, ‘వై‘కో’పాలు, ఒకటేమిటి ఒకటే వేడి పెరిగి రాష్ట్రం రాజకీయ నిప్పుల కొలిమిలా మారుతోంది. అప్పుల కొలిమికి ఇదో అదనం. ఎన్నికల వేళా విశేషం. గ్రహాలన్నీ ఉత్సవ విగ్రహాల్లా మారి ఏమాత్రమూ అనుకూలించవు. ఏ గ్రహాలూ అనుకూలించని తీరు చూసి, నిగ్రహం కోల్పోయిన ప్రజలు ఆగ్రహమే అన్నిటికీ మందు అని భావిస్తారు. మన్మధ నామ సంవత్సరం మొదలైన హోదా అంశం ‘విలంబ’లోనూ హామీగానే ఉండి శాశ్వతత్వం పొందుతుంది. విభజన చట్టంలోని 19 హామీలపై 19 కమిటీలను వేసి అన్నీ అనవసరమే అని కేంద్రం తేల్చిపారేస్తుంది. మేమైతే అవన్నీ తీర్చిపారేస్తామని మరో జాతీయ కోయిల కొత్త పాట అందుకొంటుంది. వెరసి రాజకీయాలు తప్ప వేరే రోజువారీ అవసరాల చర్చలుండవు. అన్ని రాశులవారూ చెవుల్లో క్యాబేజీలు ధరించాలి. రోజూ పెరిగే పెట్రోల్ ధరలకు అలవాటుపడ్డట్టు, కొత్తకొత్త హామీల్ని అలవాటుపడాల్సి ఉంటుంది. మొత్తంగాచూస్తే ఈ సంవత్సరం రాష్ట్రానికి ఇతమిద్దంగా జరిగేదేమీ ఉండకపోవచ్చు. ఎన్నికల సీజన్ దాటేవరకూ ప్రజలంతా అన్ని బాధల్ని మరిపించే ‘గజనీ’ మంత్రం జపిస్తే చాలు. (అఫ్‌కోర్స్. తరువాత నేతలు అదే మంత్రం జపిస్తారనుకోండి.)
శుభం భూయాత్.

- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం