Others

సుమధుర రామాయణం.. (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

234.లక్ష్మణా దుఃఖమిక నే భరింపజాల
హృదయమున కింత క్లేశము గలుగజేసి
నట్టి రక్కసుతో సర్వప్రాణి కోట్ల
భస్మమొనరింతు నిపుడె నా బాణవహ్ని

235.ప్రళయ కాలాగ్ని రూపుడై నిలిచినట్టి
అగ్రజు త్రిపురాంతక రూపు జూచి
లక్ష్మణుడు వినయమున నంజలి ఘటించి
సర్వభూత హితునకు రోషంబు తగునె

236.దుష్టుడెవ్వడొ భువిని నేరంబొనర్ప
సర్వలోకములను బూది జేయదగునె
శాంతమూర్తివి కరుణా సముద్ర నీకె
జయము తప్పదు రమసీత గాసి పడునె

237.వెదకుదము మనమీ జనస్థానమంత
తల్లి! జాడ నొక్కరుడైన దెల్పకున్న
భీకరమ్మగు మీబాణ వృష్టి యందు
ముంచవచ్చును ముల్లోకములను నపుడె

238.లక్ష్మణుని సారవంత ప్రసంగమునకు
రామచంద్రుడు శాంతుడై ధనువు దించె
సీత నరయగ ముందుకుసాగి రొకచొ
నెత్తుటందోగి గిరి వలె నేల నొరిగి
యున్న ఖగరాజునుం జూచి రాఘవుండు

239.సీతనుం దిని లక్ష్మణా గ్రద్దరూప
మున నిచట సుఖియై గ్రాలుచున్నవాడు
ఈ దురాత్ము జంపుడు నంచు బల్కు రాము
జూచి హీన స్వరముతో జటాయువనియె

240.రామభద్ర రావణుడను రాక్షసుండు
జానకి నపహరించుక జనుచు నుండ
నడ్డగించితి వృద్ధుడనైన నాడు
ప్రాణముల సీతనుంగొని పోయెవాడు
241.అనుచు దెల్పి జటాయువు తనువు వదలె
శోకమున రామ లక్ష్మణులా ఖగేంద్రు
కగ్ని సంస్కారముల్సల్పి రంత ప్రభువు
మోక్ష మొసగె పక్షీంద్రు కమోఘ కరుణ

242.దాశరధులంత నెక్కుడౌ శ్రద్ధతోడ
తండ్రికిన్ జేసినట్టుల మంత్ర విధుల
పిండ దానము లర్పించి తీర్థములను
పుదక తర్పణలిడిరి ఖగేంద్రు కపుడు

243.రాజకొమరులట్లు భూమిజ నె్వదకుచు
సాగి సాగి క్రౌంచ వనము జేరి
హృదయ మందు నోరు గల్గి యోజన దీర్ఘ
బాహు యుగముగల కబంధు గనిరి

244.అంతలోన తమను బాహాయుగిం బట్టి
మ్రింగబోవు సమయమందు నిశిత
ఖడ్గములను బూని నరికిరి ఇనవంశ
తేజులా కబంధు భుజములపుడు

245.బాహువులు తెగి భూమిపై బడియె వాడు
పూర్వపు స్మృతితో పుణ్య పురుషులార
తమరు యెవ్వరో దెల్పుడి దయతొ ననగ
లక్ష్మణుడు తమ కథ వినిపించె నపుడు

246.రామ! తొల్లి గంధర్వుడన్ పేరు దనువు
రక్కసుని వేషమున ఋషీశ్వరుల హింస
బెట్టగ స్థూల శిరుడను తపసి వరుడు
కోపమున శాపమిడె నిట్లె గడువు మంచు

247.దుఃఖితుండనై వౌని పాదములు బట్టి
వేడుకొన శాపమోక్షము తాము గల్గ
జేతురని దెల్సె కమలజు గూర్చి తీవ్ర
తపము జేసి దీర్ఘాయువు పొందినాను
*

టంగుటూరి మహాలక్ష్మి