Others

చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భజన బృందం ఉన్నన్నినాళ్లు
నాయకులు ఉత్సవ విగ్రహాలు!

విగ్రహాలకు బ్రహ్మోత్సవాలు
విన్నపాలకు తిలోదకాలు!

ఉన్మోడికి దివ్యదర్శనాలు,
లేనోడికి మెట్ల దగ్గర దీనచూపులు!

కష్టాలను వినని పాలన ఎడారి,
కన్నీళ్లను తుడవని ఏలిక సునామి!

ఓటర్లు దేవుళ్లయి కరుణించినా,
పాలకులు రాళ్లయి నిలిచినారు!

నాయకుల స్వార్థ రాజకీయంలో
ప్రజల జీవనం అంధకారమయం!

పాలకులకు ఒంగి దండాలు పెట్టినన్నినాళ్లు
పాలితులకు పంగనామాలు పెడుతుంటారు!

అయిదు వేళ్లు లోనికి పోనినాడు
గుక్కెడు నీళ్ల కోసం వెతికిననాడు
తలదాచుకోలేక నిలబడిననాడు
ఆదుకునే నాథుడు కనబడనినాడు
బతుకు చిత్రం మారేదెన్నడు
మార్పు చదివే చరిత్రలో!!
*

-పుట్టి గిరిధర్ 9491493170