Others

పేగుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగనారాయణుని
నాభిస్థానము నుండి
ఉద్ధానమైన చతుర్ముఖ బ్రహ్మ,
తన జన్మకు కారణాలు
అనే్వషిస్తున్నప్పుడే!!
ఆ దామోదరుడు
క్షమాస్వరూపిణి అయిన
మాతృమూర్తి మాత్రమే
ఈ మాతృత్వభారము
భరించగలదని తన
పేగుబంధాన్ని
బొడ్డుతాడును నీకు
దత్తం చేశాడు కదా?
అవును నిజమే! కాకపోతే
ఈ చలనరహిత పదార్థం
అనుబంధాలను, పెనవేసుకు పెరిగిన సృష్టిపిండం,
బొడ్డు పేగుబంధాలనే కవచంగా చుట్టుకుని,
భూమి మీదకొచ్చింది గదా?
నవమాసాలు దాటిపంచమ దినంలో......
విశ్వసృష్టి కాసారం నుంచి విశ్వమానవ ప్రస్థానానికి
పురుడు పోసుకుని చైతన్యవంతుడివైనాను!
అదిగో అమ్మా! నీ ఆనందాలు కనుల నిండా నింపుకున్నావు!
కొత్తవెలుగుల కనుపాపవైనావు!!

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199