AADIVAVRAM - Others

శ్రీరామరామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు
సీతాసమేత కారుణ్యధాముడు
కార్యశూరుడు మానవ దేవుడు
పత్నీబద్ధుడు
ధర్మమనే విల్లును పట్టి
న్యాయాంబులను ఎక్కుపెట్టి
ధరలో నీతిని నిలిపిన
రామాయణ పురుషుడు
శబరి ప్రేమను ఆస్వాదించిన రేడు
అహల్యను శాపవిముక్తను చేసినవాడు
కైకేరుూ మానస పుత్రుడు
పదవీ త్యాగంలో పవిత్రుడు
తండ్రి మాట జవదాటడు
గుహుని నావలో అద్దరి చేరిన మారాజు
భద్రాచల రామదాస పోషకుడు
త్యాగయ్యకు వాగ్గేయదాత
సంగీత సాహిత్య విధాత
పోతన్నకు వరములు పలికించిన రామభద్రుడు
హనుమ మోసిన సీతారాముడు
ముల్లోకాలు చేతిలో వుంచుకున్న జగద్రక్షకుడు
రామ శబ్దం
పలుకలేని బోయ వాల్మీకిని
శ్రీరామచరిత రచింపజేసిన నువ్వు
మాకు సత్ప్రవర్తనాభరిత సౌమ్య నాగరికతను
భిక్షగా ఇవ్వలేవా
భవసాగరం దాటాక ఈ ఆత్మలేవౌతాయో
రామా శ్రీరామా
ఈ జగతిని ఆనంద రామానంద
ఆరామ మందిరం చేయవా
ఇహంలో నా తోటివారికి
సాయపడే తారకమంత్రం నీ నామమే కదా-
శ్రీరామ రామ
*

-అనంత మురళీచంద్ర ఎ.ఎస్.ప్రభాకర్ 9963887346