AADIVAVRAM - Others

బుల్లి బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరడుగుల బుల్లెట్.. వలె ఈ బుడతడిని మనం మూడడుగుల బుల్లెట్ అని పిలుచుకోవచ్చు. లేదా బుల్లి బాహుబలి అనే పేరు కూడా ఈ బుడ్డోడికి సరిగ్గానే సరిపోతుంది. ఈ కుర్రాడు ఆజానుబాహుడూ కాదు.. అలాగని కొండల్ని పిండి చేయగలననే ధీమా ఉట్టిపడే ఉడుకురక్తము పరుగులిడే యవ్వనమూ కాదు.. పలకబట్టి అక్షరాలు దిద్దే ఎనిమిది సంవత్సరాల బుడ్డోడు. బడికెళుతూ, పుస్తకాలతో కుస్తీపడుతూ, దోస్తులతో జట్టుకడుతూ, ఆటలతో, పాటలతో మురిసిపోయే పసితనంలో ఎనిమిది పలకల దేహంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడీ చైనా కురా డు.
ఆరుపలకల దేహమనేది యువకుల కలలరూపం. జిమ్‌ల చుట్టూ తిరుగుతూ, ఆహారాన్ని క్రమబద్ధీకరించుకుంటూ, నోరు కట్టేసుకుని కఠినంగా ఉంటూ, శారీరకంగా ఎన్నో కసరత్తులు చేస్తే తప్ప ఆరుపలకల దేహం సొంతం కాదు. అలాంటిది ఈ బుడతడు ఎనిమిదేళ్ళ వయస్సులో ఏకంగా ఎనిమిది పలకల దేహాన్ని సొంతం చేసుకున్నాడు. ఆటలాడే వయస్సులో కఠోర శ్రమ చేసి తన దేహాన్ని అందంగా మలచుకున్నాడు. దీనికి వయసుతో పనిలేదని చెప్పకనే చెప్పాడు. ఈ బుడ్డోడి పేఠు చెన్ యు. చైనాలోని హాంక్ ఝౌ నగరానికి చెందినవాడు. చెన్ పుట్టడమే నాలుగు కిలోల బరువుతో పుట్టాడుట. పదకొండు నెలలకే చక్కగా నడవడం నేర్చుకున్నాడట. రెండు సంవత్సరాల వయసులోనే చెన్ ఒంటిచేత్తో పుషప్స్ తీసేవాడుట. ఇవన్నీ చూసిన చెన్ తల్లి ఆశ్చర్యపోయిందట. స్కూల్లోని ఆటల నిపుణుడు అతని బలాన్ని చూసి జిమ్నాస్టిక్స్‌లో కోచింగ్ ఇచ్చాడని చెన్ తల్లి చెబుతోంది.
ఐదో ఏటే చెన్ జిమ్నాస్టిక్స్‌లో ప్రొఫెషనల్ స్థాయి కోచింగ్ తీసుకున్నాడు. అతని నైపుణ్యాన్ని చూసిన మాస్టార్లే అతన్ని జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపిక చేసుకున్నారట. ఇప్పటికే పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్న చెన్ ఆరు స్వర్ణ పతకాలు, ఓ రజత పతకం సాధించాడు. ఈ పతకాలు సాధించినప్పుడు తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి. గెలిచిన పతకాల కంటే అతని దేహదారుఢ్యం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది ఇదెలా సాధ్యమైంది? అనే ప్రశ్నలను కూడా అతనికి పోస్ట్ చేశారు. అన్నిటికీ సమాధానంగా నవ్వే వచ్చిందట! ఫొటోలు పెట్టిన కాసేపటికే వేలాది లైక్స్ రావడం విశేషం. అలా ఈ బుల్లి బాహుబలి ఇంటర్‌నెట్ స్టార్ అయ్యాడు.
ఇటీవలే ఈ హీరో చైనాలో జరిగిన జిమ్నాస్టిక్ టోర్నమెంటులో పాల్గొని విజేతగా నిలిచి బంగారుపతకం సొంతం చేసుకున్నాడు.