Others

అదీ.. అంకితభావం --శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు నందమూరి తారక రామారావు గురించి ఏ ముచ్చట చెప్పుకున్నా -అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఆయన కదలికలు, అలవాట్లు, ఆలోచనలు, ప్రతిభా పాటవాలు, చరిత్ర సృష్టించిన వైనం, అవసాన దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు.. అన్నీ తెలుసుకోదగ్గ అంశాలుగానే అనిపిస్తాయి. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన రావడం ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే, చరిత్ర సృష్టించి నిష్క్రమించడమూ ఎమోషన్ పండించిన సన్నివేశమే అనుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమ రొమ్ము విరిచి చెప్పుకోగలిగే ఎంతోమంది గొప్ప కళాకారుల్లో ఎన్టీఆర్‌ది ప్రత్యేక స్థాయి అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. అడుగు పెట్టిన దగ్గర్నుంచీ విడిచిపెట్టి వెళ్లే వరకూ -సినిమాయే ఉచ్వాశ నిశ్వాసలుగా బతికిన ఎన్టీఆర్‌కు -చలనచిత్ర రంగం గురించి ఉన్న పరిజ్ఞానమూ బహుశా మరే కళాకారుడికీ లేదని చెప్పొచ్చు. చిత్ర నిర్మాణంలో ఆయన తీసుకొనే శ్రద్ధ, జాగ్రత్తల గురించి ఆయనతో పని చేసిన, దగ్గరగా చూసిన తరాలు ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉండేవారు. ఒక చిత్రం మొదలుపెట్టే ముందే కథ, సన్నివేశాలుగా రాసుకునే దాని కథనం, మనం చెప్పబోయేది సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో మలచగలుగుతున్నామా? లేదా? అనే విషయంపై తగు జాగ్రత్తలు తీసుకునేవారు. ఒకటికి పదిసార్లు బేరీజు వేసుకునే వారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే -ఆ చిత్రానికి విజయం సాధించగలిగే అర్హత ఉంటుందని బలంగా నమ్మేవారిలో ఎన్టీఆర్ ప్రథములు కూడా. చిత్ర నిర్మాణం నుంచి విడుదలకు ముందు ఆ చిత్రం పబ్లిసిటీ వరకూ తీసుకొనే జాగ్రత్తలు గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడాన్ని చూస్తే, ఆయన నటుడే కాదు చిత్ర పరిశ్రమకు ఘనాపాటి అనిపించక మానదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించి పాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉన్న రోజుల్లోనూ సొంత స్టూడియో రామకృష్ణా సినీ స్టూడియోలో చిత్రాల పబ్లిసిటీ గురించి తగు సూచనలు ఇస్తున్నపుడు తీసిన అరుదైన చిత్రమిది. అందుకే ఆయన -అంతవాడు అంతటివాడయ్యాడు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717