Others
లోచూపు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 March 2018
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి

వృథాగా
ఎవరి హృదయాన్ని
పగలగొట్టొద్దు!
అది అద్దం వంటిది
పగిలిన ప్రతి ముక్కా
నీ క్రూరత్వానే్న గుణిస్తది!
రాయి విసరడం ఎంత తేలికో
గాయం ఊరుకుంటదా?
మానినా మరకై గుర్తుపెట్టుకుంటది!
స్వీయ గాయాలే లెక్కలేనన్ని
గణించడం పూనుకుంటే
జీవితం కురచనవుతది!
నీకూ నాకూ పెద్ద తేడా ఏముంది చెప్పు?
దారులు వేరుగావచ్చు
ఇద్దరం ఆవలి తీరం చేరాల్సిన వాళ్ళమే
చేయి గాలిలో లేచినప్పుడే
నువ్వైనా నేనైనా
లోపలికోసారి తొంగి చూసుకుంటే
చేతిలోని రాయైనా
పువ్వై పరిమళిస్తది!