Others

పేద గుండె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రని ఎండలో
సెగలు కక్కుతున్న తారురోడ్డు నీడలో
గాలి మేడలో సైరన్ల జోరులో
సాగుతున్న ఆమె జీవన వేదనను
ఒక్కసారన్నా తిలకించారా?
సమ్మెట పైకెత్తి
ఊపిరి పీల్చలేక సన్నని రొదతో
సగం చినిగిన మురికి బట్టలతో
మిలమిల మెరిసిపోతూ
తరగని వెనె్నల కనుల అందాన్ని
పసివాడని దేహాన్ని, మసివాడిన గాయాల్ని
రక్తం చిందుతున్న హస్తాల్ని
ఎరుపెక్కిన పెదాల్ని
ఒక్కసారైనా చూశారా
ఆమె నుదుటి నుండి జాలువారుతున్న
చెమట బిందువులు
ముత్యాల మెరుస్తూ
పుడమి తల్లిని పునీతం చేస్తూ
సప్తవర్ణాలు వెదజల్లుతున్న
కనువిందైన దృశ్యాన్ని
మిమ్మల్ని మీరే మైమరిచి, పరవశించి
పులకిత దేహభరితులై
ఒక్క జాలిచూపైనా విసిరారా?
చిరునవ్వైనా చిందించారా?
జాలిలేని మన గుండెను
గూడులేని ఆ పేద గుండెతో
ఒక్క నిమిషమైన జత కలిపారా?
గుసగుసలాడిన మీ గుండె
మీ దరికి రాదన్న నిజాన్ని
ఒక్కసారైనా స్వప్నించారా?

- డా. వి. రంగారావు, 9948875892