Others
మా నెత్తుటి వర్ణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశపు తెరమీద
ఎన్నో ఎనె్నన్నో వర్ణాలు!
పశ్చిమాన సిందూరపు సూరీడు
రౌద్రపు రంగంటుకొని ఖిన్నుడై
తొలి సంధ్య మొదలు మలి సంధ్య దాక
ఏ దారుణ దమనాలు గాంచాడో
ఏ మారణ హోమాలు కన్నాడో!
ఓవైపు వినూత్న ఆధునిక విమానాలు
ఆశాజీవుల నిండుగ నింపుకొని
మరోవైపు చంద్రుడిపై ఆవాసానికి
నివాసాలు నిర్మించ దూసుకెళ్తూ రాకెట్టులు!
అల్లంత దూరాన దారి చివరన
బాటసారులు హరివిల్లు తోరణం దాటుతూ
ఆకాశపు తెరమీదకు ఎగబాకుతున్నట్టు
అంతా మాయ హరివిల్లులో వర్ణాల్లా!
హరివిల్లులో వర్ణాలు మాయేమో
మా మనుషుల్లో వర్ణాల్లేవని
నిజ నిరూపణకు సిద్ధమనీ
పిడికెడు బువ్వకు అలమటించే
మా తోటి తమ్ముడే సాక్ష్యమనీ
తన నెత్తురూ మా నెత్తురూ ఒకటేనని!
నిరూపించాలనీ నిరూపిద్దామంటే
భయపడి పరిగెత్తబోయే బడుగు
శాంపిల్ రక్తానికే వర్ణ నిరూపణకే కట్టి కొట్టి
కొద్దిగా తల కొద్దిగా రక్తం లాగాం
నమ్మకం లేదా సెల్ఫీలు తీశాం
నిజం మనదంతా ఒక్కటే వర్ణం
కూసింత రక్తానికే ప్రాణం వదిలాడు
అయతేనేం ఒక్కటే వర్ణమని నిరూపించాం
బడుగుల ప్రాణాలు పోతేనేం
మళ్లీ మళ్లీ నిరూపణకు సిద్ధం!