Others

నాకు నచ్చిన చిత్రం--మాయాబజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1957లో విడుదలై మరపురాని చిత్రంగా నిలిచి 2010లో బ్లాక్ అండ్ వైట్ నుండి కలరైజు అయి ఘన విజయం సాధించిన ఏకైక చిత్రం మాయాబజార్. కెవి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, సంధ్య, ఋష్యేంద్రమణి, గుమ్మడి, సిఎస్‌ఆర్, మిక్కిలినేని, నాగభూషణం, అల్లు రామలింగయ్య, వివి సుబ్బయ్య, మాధవపెద్ది, ఛాయాదేవి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి మొదలైన అతిరథ మహానటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు ధరించారు. తన రచనా బలంతో పింగళి నాగేంద్ర అద్భుతమైన కథను సృష్టిస్తే, మార్కస్ బార్ట్లే తన సినిమాటోగ్రఫీతో మాయచేసి చూపించిన చిత్రమిది. పాండవులు లేకుండా శశిరేఖ, అభిమన్యుల వివాహం గమ్యంగా రూపొందించిన అద్భుత చిత్రమిది. అభిమన్యునితో శశిరేఖ వివాహానికి బలరాముడు అడ్డుచెప్పగా, నాటకీయంగా వారిని ఘటోత్కచుని ఆశ్రమానికి చేరుస్తాడు శ్రీకృష్ణుడు. తరువాత కథలో భాగంగా ఘటోత్కచుడు శ్రీకృష్ణ ఆశీర్వాదంతో శశిరేఖను తన ఆశ్రమానికి చేర్చి మాయాశశిరేఖ అవతారం ఎత్తుతాడు. అక్కడ లక్ష్మణ కుమారునితో వివాహం శశిరేఖతో జరగాల్సి ఉండగా దుర్యోధనాదుల కుట్రను బహిర్గతం చేసి అభిమన్యు, శశిరేఖల వివాహానికి అడ్డులేకుండా చేయడంలో శ్రీకృష్ణ, ఘటోత్కచుల పాత్ర, ఘటోత్కచుని హావభావ విశేషాలు సినిమాకు హైలెట్‌గా భాసిస్తాయి. ప్రప్రథమంగా ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా ఆంధ్రుల మనసులను చూరగొన్నాది ఈ చిత్రంలోనే.
మహాభారత కావ్యంలో లేకుండా జానపదుల వాడుకలోని కథ ఆధారంగా నిర్మించినదీ చిత్రం. నీవేనా నను తలచినది/ చూపులు కలసిన శుభవేళ/ లాహిరి లాహిరి లాహిరిలో/ భళి భళి భళి భళి దేవా/ నీకోసమే నే జీవించునది/ అహనా పెళ్ళంట/ సుందరి నీవంటి దివ్యస్వరూపము/ వివాహభోజనంబు/ విన్నావ యశోదమ్మ/ దయచేయండి, శ్రీకరులు, దేవతలు/ వర్ధిల్లవమ్మా వంటి ఉత్తమ పాటలను పింగళి నాగేంద్రరావు, ఎన్ రామయ్యదాస్, ఎ కృష్ణన్, శివరామ్ మొదలైనవారు అందిస్తే, ఘంటశాల, రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా పి సుశీల, ఘంటశాల, పి లీల, కె రవి, పిఠాపురం, మాధవపెద్ది, ఎంఎల్ వసంతకుమారి గాయకులుగా అలరించిన దృశ్యకావ్యమిది. అశేష సినీ అభిమానులకు నచ్చే ఈ చిత్రం అంటే నాకూ చాలా చాలా ఇష్టం.

***
వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం