Others

గురివిందలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిస్తేనే మర్మం స్ఫురిస్తుంది
పైకి తోచని వెన్న చిలికితే కనబడుతుంది
నేడు మతవాదులందరు
తమవికాని పురాణాలను తలకెత్తుకుంటన్నారు
చదవడం వచ్చని పిచ్చిగా పుటలన్నీ తిరగేస్తున్నారు
అబ్బిందే సత్యమని ఆరడి చేస్తున్నారు
అర్థాలు బోధపడక వ్యర్థమంటున్నారు
చీకటిలో నడవాలంటే కళ్ళుంటే చాలదు
కాంతిని పంచే కరదీపిక కావాలి
పైపైన చూస్తే అద్దం పరచినట్లుగా ఉంటుంది తటాకం
దిగిచూస్తే తెలుస్తుంది అగాధం
నమ్మకాలన్నీ మూఢనమ్మకాలు కావు
ఒక రూపాన్ని పూజిస్తూ మరొక రూపాన్ని ద్వేషించడం
జలం బలం నీరు నీరసం అన్నట్లుంది
దేవుడు అనంతరూపుడు
రూపాలన్నీ ఆయన ప్రతిరూపాలే
మూడత్వం కళ్ళున్న అంధత్వం
పొరుగువారి సంస్కఋతిని గౌరవించడం
మానవత్వానికి ఆనవాలు
జోలిమాలిన పనికి పాలుపడడం
వానరత్వానికి సంకేతం
పరమత సహనమే పరమధర్మం
అది పట్టుబడకపోవడమే మన ఖర్మం!
*

-చిరమన వెంకట రమణయ్య 94413 80336