Others

మమతల కోవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారాంచేస్తున్న
పిల్లలతో తాత
కథ చెబుతాననగానే
అల్లరినంతా నిశ్శబ్దం కమ్మేసింది
అదిగదిగో
సృష్టికర్త స్వయంగా
పల్లకిమోస్తూ
దారివ్వండంటూ
చిరునవ్వులు చిందిస్తూ
భూతల స్వర్గంగా అడుగులు
వింటున్నారా చెప్పండి చూద్దాం
మీలో ఎవరైనా
అదీ అదీ ఎవరో కాదు
మానవతామూర్తి సహనశీలి
మమతల కోవెల
విశ్వసనీయతకు
ఆత్మస్థైర్యానికి
నిలువుటద్దము
మానవాళికి నిరంతరం
సంరక్షకురాలిగా వెన్నంటి
కష్టాలు కడగండ్లూ
ఒంటిచేతితో
స్వచ్ఛమైన నవ్వులు చిందించే
ముఖచిత్రం
విశ్వసనీయతకు
ఆత్మస్థైర్యానికి
నిలువుటద్దము
జీవిత ఆసాంతం జీవన దశలుగా
చిట్టిపొట్టి పట్టీల పాదాల సవ్వడిగా
ఇల్లంతా కలియదిరుగుతూ
చిరునవ్వుల ముత్యాలు ఒలకబోస్తూ
అమ్మానాన్నల అపురూపంగా
అనురాగం పంచే
అక్కాచెల్లెలుగా
సప్తపదిగా అడుగులేసి
జీవిత భాగస్వామికి సగభాగమై..
గృహలక్ష్మిగ కొలువుతీరి
సంసార సాగరంలో నడయాడే
జీవన నౌకకు చుక్కానిలా..
పొత్తిళ్లలో పురుడు పోసుకున్న
బిడ్డను గుండెలకు హత్తుకొని
జీవామృతం తాగించి
అమ్మగా ఆదిగురువుగా
పిల్లలకు బొమ్మరిల్లు కథలై..
ఎక్కడయితే స్ర్తిలు గౌరవించబడతారో
దేవతలు సంచరిస్తారు
పిల్లలలో తానూ ఒకడైపోయి
ఊ కొడుతూ జో కొడుతూ
కథ చెబుతూ వింటూ
దిండుపైకి జారిపోతున్న
నిదురించే తోటలోకి నాన్నా అనే పిలుపు
కన్నుల్లో నీరు తుడిచిందీ!!
*

-హరిహరనాథ్ మడిపల్లి 9603577655