Others

స్క్రిప్ట్ ముఖ్యం డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-వర ముళ్లపూడి

మీ నేపథ్యం?
-పుట్టి పెరిగి చదివిందంతా మద్రాస్‌లో. ప్లస్ 2 తరువాత కమర్షియల్ పైలెట్‌గా వెళ్లాను. కార్పొరేట్ స్టయిల్ యాడ్స్ చేశాను. వెంకటేశ్వర వైభవం పేరిట ఎస్‌విబిసికి ఓ ప్రోగ్రాం ప్రొడ్యూస్ చేశాను.
దర్శకుడిగా ఎలా?
-చిన్నప్పటి నుండి నా భాష బాగుండేది. పైలెట్ ట్రైనింగ్ ముగిశాక బాపుగారి వద్ద అసిస్టెంట్‌గా చేరతానని నాన్నతో అన్నా. తర్వాత తర్జనభర్జనలు జరిగి బాపుగారి వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. అలా దర్శకుడిగా ప్రయాణం మొదలైంది.
బాపు, రమణల ముద్ర చూపగలరా?
-ప్రస్తుతం రూపొందించిన కుందనపుబొమ్మ అలాగే వుంటుంది. బాపు స్టయిల్‌లో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.
నచ్చిన జోనర్స్?
-రొమాంటిక్, కామెడీ. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు, థ్రిల్లర్స్ చాలా ఇష్టం.
హారర్ కామెడీపై అభిప్రాయం?
-మంచి స్క్రిప్ట్ రాసుకుంటే ఏ సినిమా అయినా బాగా వస్తుంది. ఇటీవల వచ్చిన క్షణం సినిమాకు దాదాపు ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇప్పుడొస్తున్న హారర్ కామెడీ చిత్రాలు సరైన స్క్రిప్ట్ లేకపోవడంవల్ల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి.
తర్వాత చిత్రాలు?
-బాపు, రమణలు సినిమాగా తీయాలనుకున్న ఓ కథకు ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. నేను చేయగలను అనుకున్న నా కథలకు మాత్రమే దర్శకత్వం వహిస్తాను. చేయలేను అనుకున్న నా కథలను చేయగల దర్శకులకు ఇస్తున్నాను.
దర్శకుడంటే?
-150 ఇగోలను ఒక్క త్రాటిపైకి తెచ్చి తాననుకున్నది చేయించుకోగలవాడు అని బాపుగారు చెప్పేవారు. అది నిజం!

-శేఖర్