Others

లోపల ఎవరో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోపల ఎవరో తిరుగుతున్నారు
ర్యాలీ తీస్తున్నారు
ముళ్లకంచెల మీదుగా నడుస్తూ
బారికేడ్లను పడదోసుకుంటూ
వీధుల వెంట ఊరేగింపుగా సాగుతున్నారు
ప్రశ్నిస్తున్నారు గర్జిస్తున్నారు నిలదీస్తున్నారు
హక్కుల గురించి అర్థం కాని భాషలో
బాణాలు విసురుతున్నారు
ఆక్రమణల గురించి అర్థం లేకుండా
నిప్పులు కురిపిస్తున్నారు
కుర్చీకాళ్ల పగుళ్ల గురించి కుట్రపూరితంగా
రాళ్లు రువ్వుతున్నారు
కల కాబోలు అని సరిపెట్టుకున్నాను
మానసిక అలజడి అని సర్దిచెప్పుకున్నాను
ప్రదర్శన మాయం కాలేదు సరికదా
ఎవరెవరో వచ్చి జత కలుస్తున్నారు
నాలుగు రోడ్ల కూడలి నదిలా మారి
పోటెత్తి, ఆనకట్టల్ని నేలమట్టం చేసేలా...
డామిట్
అచేతనంగా ఉంటే కల నిజమయ్యేలా ఉంది-
ఎవరక్కడ?
వాళ్లందరినీ ఉక్కు సంకెళ్లతో బంధించండి
నినాదాలను వాళ్ల గొంతుల్లోనే పాతిపెట్టండి
కుడిచేతి పిడికిళ్లను కత్తిరించి
కోటగుమ్మానికి వేలాడదీయండి
అప్పటికీ కదలికలుంటే
రాజ్యబహిష్కరణ విధించండి!
*

-ఎవీ రామిరెడ్డి 9866777870