Others

‘ఫ్రంట్’ను నడిపేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూట పాతికేళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో నిస్సారమైపోయింది. ఆ పార్టీలో ఇపుడు సిద్ధాంతకర్తలు, రాజనీతిజ్ఞులు, వ్యూహకర్తలు, లౌక్యులూ కరువయ్యారు. అసమర్థ పాలన, అవినీతి దందాలతో ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. ఈ కారణంగానే గత ఎన్నికల్లో భాజపా కేంద్రంలో అధికారంలోకొచ్చింది. జాతీయ భావజాలంతో, ఆర్థికాభివృద్ధిని ప్రోదిచేస్తూ, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పునరుజ్జీవింపచేస్తారనే ఆశలతో ప్రజలు భాజపాకు పట్టం కట్టారు. ఆ ఆశల పల్లకీ నుండి ప్రజలను కిందకు దింపేసింది ప్రస్తుత భాజపా ప్రభుత్వం. కాంగ్రెస్ వారు ప్రజలను ఎండలో నిలబెడితే, భాజపా నేతలు జనాలను గడ్డకట్టే చన్నీళ్ళల్లో నిలబెట్టారు. దేశ ప్రజలకు రాజకీయాలపైనే నమ్మకం సడలిపోతున్నది. పార్టీలు వేరైనా అందరి పాలనా ఒక్కటేనని ప్రజలకర్థమైంది. అందుకే ఈ రెండు పార్టీలకూ భిన్నమైన ‘మూడవ ప్రత్యామ్నాయం’ కావాలన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ‘్థర్డ్ ఫ్రంట్’ అత్యంత అవసరమని బల్లగుద్ది మరీ ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే, ఈ మూడో ఫ్రంట్‌ను ‘నేను నడుపుతాను..’ అని ఇతర నాయకుడెవరూ అనే అవకాశమివ్వకుండా ‘నేనే నడుపుతాన’ ఆయన స్పష్టం చేసేశారు. మూడవ ఫ్రంట్ అనగానే ప్రజలు, కొందరు నాయకులూ సుముఖత వ్యక్తం చేస్తారు. అయితే, కేసీఆర్ సహా ప్రతిపక్షాలలో ఏ నాయకుడైనా మూడో ఫ్రంట్‌ను ఏర్పరచగలరా? ఇది సాధ్యమా? దేశంలో ఎన్నో చిన్నా చితకా జాతీయ పార్టీలున్నాయి. ఒకే రాష్టన్రికి పరిమితమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. ఈ పార్టీలు చిన్నవే అయినా, వాటి నాయకులు మాత్రం పెద్దవాళ్ళు! వీటిలో ప్రతి నేతా తాను ప్రధానమంత్రిని కాదగిన వాడినని అనుకునేవారే! వీరికి అనుభవంతోపాటు, ఆత్మాతిశయం కూడా ఎక్కువే! కెసీఆర్‌ను కాని, మరొక నాయకుడ్ని కాని ముందు పెట్టి వెనుక నడవడానికి అంగీకరించేవారు కాదు. అందుకే మూడో ఫ్రంట్ అవసరమున్నా కూడా ఇంతకాలం ఏర్పడలేకపోవడానికి కారణం! సైద్ధాంతిక విభేదాలు కారణం కాదు. ఇప్పటి పార్టీలకు సిద్ధాంతాలంటూ ఏమీ లేవు. వాటినెపుడో దేశ రాజకీయం మరచిపోయింది.
లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణంతటి గొప్ప వ్యక్తి ఏర్పరచిన జనతాపార్టీ కూటమి నాయకుల ఆత్మాతిశయాల బరువుతో కూలిపోయింది! తరువాత జరిగిన రెండు మూడు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇపుడు నాయకుని కొక పార్టీ లెక్కన వున్నాయి. ఇదంతా నాయకత్వ పెత్తనం కోసమే! ఇటువంటివారితో కెసీఆర్ మాత్రమే కాదు, ఏ నాయకుడూ ఫ్రంట్ ఏర్పాటు చేయలేరు. వ్యాధి నిర్థారణ సక్రమంగా జరిగితేనే తగిన వైద్యం చేయగలరెవరైనా! నాయకుల్లోనే కాదు ప్రజల్లో కూడా నైతిక స్థాయి దిగజారింది. ఒకనాటి ఏకజాతి భావన పూర్తిగా కరిగిపోయింది. తమ ప్రాంతం, తమ వర్గం, తమ కులం, చివరకు తమ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటున్నారు చాలామంది ప్రజలు. ఇందుకు చాలావరకూ నాయకులే కారణం. వ్యక్తిగతంగా తమ నాయకత్వం నిలబడ్డానికీ, పెరగటానికీ తమ వర్గాల ప్రజలను సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారు. జాతీయ భావనకు దూరమైన ప్రజలు భిన్నమైన గ్రూపులుగా, వర్గాలుగా విడిపోతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులను మార్చడం అంత తేలిక కాదు. సంపూర్ణ విప్లవం లాంటి ఒక ఉద్యమం ప్రజలను ఆధారంగా చేసుకుని రావాలి. ప్రజల్లోని అవినీతికి అభద్రతాభావం, పిరికితనం కూడా కారణమే! అందువలనే వారు గతంలో వలే ఐక్యతతో కలవలేకపోతున్నారు. గ్రూపులుగా విడిపోతేనే తమకు లాభం కలుగుతుందని జనం అనుకుంటున్నారు. ఈ ఉద్యమానికెవరు నాయకత్వం చేపట్టినా, ముందుగా ప్రజల్లోని ఈ అభద్రతాభావం తొలగిపోయి, జాతి ఏకత్వం వల్లనే తమకు భద్రత, సంక్షేమం కలుగుతాయనే నమ్మకాన్ని కలిగించాలి. అటువంటి నమ్మకం ప్రజలకు కలిగినపుడు, కుహనా నాయకుల మాటలకూ ప్రలోభాలకూ లొంగరు! ఈ పరివర్తితా ఉద్యమం అంత తేలిక కాదు. అయితే, అసాధ్యమూ కాదు. ప్రజలనాధారంగా చేసుకుని మొదలయ్యే ఇటువంటి ఉద్యమం ఈనాటి కలుషిత రాజకీయ, సామాజిక వ్యవస్థలను కదిలించి నెట్టివేయగలదు! ఇటువంటి పరిస్థితుల్లో సమాజ గమనాన్ని కాలం తన అధీనంలోకి తీసుకుంటుంది! చారిత్రక పరిణామాన్ని ఒకసారి గమనించి చూస్తే, సమాజం అస్తవ్యస్తమైపోయినపుడు, మార్పు అసాధ్యమనుకున్నపుడు, కాలం తన అధీనంలోకి తీసుకుని పరివర్తిత వ్యవస్థలనేర్పరచిన సందర్భాలు కనుపిస్తాయి. ప్రజల్లోనుండే నాయకులొస్తారు!

-మనె్న సత్యనారాయణ సెల్: 99890 76150