Others

స్వయంవ్యక్త క్షేత్రం శ్రీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్ష్వాకుల కులదైవమైన శ్రీరంగనాథుడు అర్చాస్వరూపముగా వెలసి వున్న దివ్య దేశం శ్రీరంగక్షేత్రం. తమిళనాడులోని చోళమండలంలో వున్న తిరుచునాపల్లి అనే పట్టణం అనేక భవ్య దేవాలయములకు నెలవై వున్నది. ఆ దేవాలయములలో అత్యంత విశిష్టమైనది శ్రీరంగక్షేత్రము.
ఉభయ కావేరుల మధ్యలో నెలకొని ఉన్న ఈ శ్రీరంగనాథుని దేవాలయము భూలోక వైకుంఠమని ప్రసిద్ధిగాంచినది. దాదాపుగా 150 ఎకరములలో విస్తరించి ఉన్న ఈ దేవాలయ ప్రాశస్త్యమును గూర్చి వాల్మీకి రామాయణము, పద్మపురాణము, మత్స్య పురాణములలో చెప్పబడినది.
సప్తప్రాకారాలతో, 21 గోపురాలతో, 9 పుణ్యతీర్థములతో అలరారే ఈ శ్రీరంగనాథుని దేవాలయము మన దేశంలోని అతి పెద్ద దేవాలయముగా చెప్పబడినది. స్వయంవ్యక్త క్షేత్రమైన శ్రీరంగనాథుని దేవాలయము అతి పురాతనమైనది. తొండరడిప్పొడి ఆళ్వారు, భగవద్రామానుజులు, నాథమునులు ఆదిగాగల మహానుభావులు ఇక్కడ నివసించారు. ఢిల్లీ పాదుషా కుమార్తెయైన సుల్తానీ, చోళరాజు ధర్మవర్మ కుమార్తె, చేరరాజు కుమార్తె ఈ శ్రీరంగ క్షేత్రంలోనే మోక్షమును పొందారు.
శ్రీరంగనాథస్వామి గర్భాలయంలోనే కారణజన్మురాలైన గోదాదేవి ఆ స్వామిలో ఐక్యమైంది. ఈ దివ్య దేశంలోని ప్రాకారాలు, గోపురాలు, మండపాలు, సన్నిధులు మొదలైన అన్నీ అద్భుత కళాఖండాలు.
స్థలపురాణం
శ్రీమన్నారాయణుని ద్వారా బ్రహ్మదేవునికి లభించిన విగ్రహము శ్రీరంగనాథునికి లభించింది. నారాయణుడు తనకు అనుగ్రహించిన ఆ అర్చామూర్తిని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చి అనునిత్యం అర్చించమని ఆదేశించాడు బ్రహ్మదేవుడు. ఆక్రమంలో ఇక్ష్వాకుల కుల దైవమైన శ్రీరంగనాథుడు శ్రీరామచంద్రుని చేత పూజలందుకున్నాడు. శ్రీరామ పట్ట్భిషేకం తర్వాత తన వియోగమునకు దుఃఖిస్తున్న విభీషణునికి తన ప్రతిరూపమైన శ్రీరంగనాథుని విగ్రహమును అనుగ్రహించాడా శ్రీరాముడు.

-డా. కొమాండూరి అరుంధతి