Others
నా కవిత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 April 2018
- మరువాడ భానుమూర్తి, 8008567895

నా కవితా విహంగం
ఊహల రెక్కలు కట్టుకుని
స్వేచ్ఛగా విహరిస్తుంది
నా కవితా జలపాతం
జన జీవన స్రవంతిలో
స్వచ్ఛంగా ప్రవహిస్తుంది
నా కవితా మలయ మారుతం
ఆశను శ్వాసగా మార్చుకుని
నిశ్చయంగా నినదిస్తుంది
నా కవితా విలయతాండవం
విప్లవాన్ని ఊపిరి చేసుకుని
నిర్భయంగా నాట్యం చేస్తుంది
నా కవితా భావగీతం
చైతన్యానికి సంకేతమై
నిర్మలంగా స్ఫూర్తిదాయకవౌతుంది
నా కవిత - ప్రభంజనమై
నాగరికపు పురవీధుల్లో
ప్రగతిని ప్రజ్వలింప చేస్తుంది
నా కవిత ప్రభాత గీతమై
మానవతను మేల్కొల్పుతుంది
నా కవిత మమతకు మార్గమై
అసమానతలను రూపుమాపుతుంది!!