Others

సాపత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృతిలో ఉందంటే
ఆ పాటలో
ప్రాణం ఉన్నట్లే కదా!

సాంత్వన కల్గిందంటే
ఆ జలధార
జీవధార అయనట్లే కదా!

మది పులకించిందంటే
ఆ గానంలో
గాంధర్వం ఉన్నట్లే కదా!

పరవశం కల్గిందంటే
ఆ శ్వాసలో
ఓ పరిమళం ఉన్నట్లే కదా!

హృదయాంతరాళాన్ని
తాకిందంటే
ఆ కవితలో
ఓ రసానుభూతి ఉన్నట్లే కదా!

ఓ భంగిమ ఆకట్టుకొంది అంటే
రమ్యమైన సౌష్టవం
అందులో ఉన్నట్లే కదా!
సాటి మనిషన్న ఓ స్పృహ
సాకారమైంది అంటే
మనలో మానవత్వం ఉన్నట్లే కదా!

సాటి ప్రాణి అన్న
ఓ కృప
కృతకృత్యమైందంటే
మనలో కారుణ్యత ఉన్నట్లే కదా!

విలువలన్నా
వాటి సాపత్యాలన్నా
ఇలాగే వుంటాయ మరి.
స్వాభావికంగా, స్వతఃసిద్ధంగా
సహజాత్మకంగా, నిగూఢంగా
ప్రత్యామ్నాయాలనేవి లేకుండా
వెలుగొందే ఓ ఉషస్సులా
వికసించే ఓ పున్నమిలా
సేదదీర్చే ఓ సమీరంలా!

- కె. రవీంద్రబాబు, 9052778988