AADIVAVRAM - Others

సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఫయర్స్ కన్వర్‌జేషన్స్’ అన్న పుస్తకంలో సుసాన్ స్కాట్ ఓ మంచి కథని ఉదహరించింది.
మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియజెప్పే కథ అది.
వాళ్ల ఇంటి వెనక పెరడులో చుంచెలుకలు ఎక్కువగా వున్నాయి. వాటిని తొలగించే పనిని ఆమె సోదరుడు స్వీకరించాడు. ఆ చుంచెలుకలను ఏరివేయడానికి ఆ పెరడులో వున్న రంధ్రాలని మూసివేశాడు. పొగపెట్టి అవి బయటకు వచ్చే విధంగా చాలా ప్రయత్నాలు చేశాడు.
కొద్ది రోజులు ఆ చుంచెలుకలు కన్పించకపోయేవి. కానీ కొద్దిరోజులకే అవి మళ్లీ దర్శనమిచ్చేవి.
విసుగెత్తిపోయింది అతనికి. ఏం చెయ్యాలో తోచలేదు.
ఒకరోజు అతను వాళ్ల ఊరులోని మెయిన్‌బజార్‌లో వెళ్తున్నప్పుడు అతనికి ఓ వ్యక్తి తారసపడ్డాడు. అతను వేసుకున్న జాకెట్ అతన్ని బాగా ఆకర్షించింది. దాని మీద ఇలా రాసి ఉంది.
‘చుంచెలుకలను తొలగిస్తాను’
అతన్ని పరిచయం చేసుకున్నాడు.
కచ్చితంగా చుంచెలుకలు రాకుండా చేస్తానని అతను చెప్పాడు. తాను చేసిన ప్రయత్నాలు అతనికి వివరించాడు.
చివరికి అతన్ని ఇలా అడిగాడు.
‘నేను చేసిన ప్రయత్నాలు కాకుండా మీరు ఇంకా ఏమి చేస్తారు?’
అతను ఇలా జవాబు చెప్పాడు.
‘నేను ఆ చుంచెలుకలను చంపను. అవి తినే ఆహారం (కీటకాలు) అక్కడ లేకుండా చేస్తాను. ఆ చుంచెలుకలు వాటికవే మీ ఇంటి పెరడు నుంచి వెళ్లిపోతాయి. మళ్లీ రావు’
అతని జవాబు విని ఆమె సోదరుడు ఆశ్చర్యపోయాడు.
ఈ కథని మన జీవితానికి అన్వయించుకోవచ్చు. మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి తొలగిపోవు.
అలాగే మనల్ని వేధిస్తూ ఉంటాయి.
ఆ సమస్యకు కారణమైన విషయాన్ని మనం పట్టించుకోము. అది పట్టించుకోకుండా వేరే విషయాల మీద మన దృష్టిని కేంద్రీకరిస్తాం. అందువల్ల సమస్యలు సమస్యల్లాగే ఉండిపోతాయి.
చుంచెలుకలు తొలగించడానికి ఆ వ్యక్తి చెప్పిన సూత్రాన్ని మన సమస్యలకి వర్తింపచేయాలి.
అంతే!
కొంత ఉపశమనం లభిస్తుంది.

- జింబో 94404 83001