Others

ఉత్తగుంటె కాదు.. ఎత్తుకుంటెనే తెలుస్తది.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసమెత్తు రాగి కల్పకుంట యెంత సొక్కం బంగారమైనా ఆభరణం కాదు. ఇది లోక సామెత. జరంత తేడా లేకుండా రాజకీయం చే యలేం.. అనేది నేటి మాట. రాజకీయం అంటేనే పలు రకాల మా నసిక స్థితులు కలిగిన భిన్నమైన వ్యక్తులతో కూడిన సామాజిక వ్యవహారం. ఎత్తులు, వ్యూహాలతో అధికార వ్యవస్థలోకి చొచ్చుకుపోవడమే పరమావధిగా వుంటుంది రాజకీయం. అటువంటి రాజకీయాల్లో స్వచ్ఛమనస్కులు.. అచ్చు పోసినట్టు వుండాలనుకునే మనుషులు.. మనకు దొరకాలనుకోవడం.. ఆత్యాశతోకూడిన వూహాజనిత ఆలోచనే తప్ప వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండే ముచ్చెట కాదు. మనకు నచ్చని రాజకీయాలు చేసే వాళ్లంతా బూర్జువాలనీ, ప్రజా ద్రోహులని ముద్దరలేసుకుంటా కూసోలేం.
గమ్యం ముఖ్యమా? దాన్ని చేరుకునే మార్గం ముఖ్యమా? అనే చర్చ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ప్రజాసేవకు అధికారమే పరమావధిగా మారిన రాజకీయ వ్యవస్థలో గమ్యమే ముఖ్యమనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం నేర్చుకున్న నీతులు నియమాలు విలువలు... వర్తమాన రాజకీయ వ్యవహారాల్లో ఇమడకపోవచ్చు. దానర్థం రాజకీయాలంటే విలువలకు తిలోదకాలు ఇవ్వాలని కాదు. బాహ్య పరిస్థితులు అట్లున్నయని చెప్పడమే. గమ్యాన్ని చేరుకోవడమే ముఖ్యం అనే సమాధానమిచ్చిన వాళ్లు రాజకీయాలు చేయగలరని.. మార్గం ముఖ్యమని అనే వాళ్లు ఉద్యమాలు చేయడానికి ఇష్టపడే వాళ్లని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉద్యమ సంస్థ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందాలనుకున్నప్పుడు.. ఏం చేయాలె.? అప్పటిదాకా కట్టుబడివున్న నిర్దిష్ట విలువలనే అనుసరించాల్నా.? లేక మారిన పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడమా?
మాది ఇకనుంచి రాజకీయ పార్టీనే అని తెరాస అధ్యక్షుడు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రకటించడంలోని ఉద్దేశాన్ని మనం పైన చర్చించిన కోణంలోనే అర్థం చేసుకోవాలి. తెలంగాణ కోసం పోరాడినం, త్యాగాలు చేసినం. తెచ్చుకున్నం.. తెల్లారినుంచి ప్రభుత్వాన్ని నడపాలె. మరి యెట్ల చెయ్యాలె.. ముఖ్యమంత్రిగా ముందుగాల.. రాజకీయాలను ప్రక్షాళన కార్యక్రమాన్ని ముందలేసుకోవాల్నా.? లేక.. పాలనను చేపట్టి ఆగమైన తెలంగాణను సక్కదిద్దుకుని ఉన్నంతల్నే బాగుచేసుకోవడమా..? విలువల ప్రకారం నడువాలంటే ముందు అవి మారినంకనే రాజకీయాల్లోకి దిగాలె.. లేదా వాటిని మార్చి దిగాలె. అట్లా సాధ్యమైతదా.? సాధ్యమైతది కావచ్చు.. ఎప్పుడంటే.. కేసీఆర్ ఓ మూడేండ్లు ఆగి.. ఉద్యమకారులందరికీ అన్ని రంగాల్లో ట్రైనింగు ఇచ్చి అప్పుడు మొదలు పెట్టండి తెలంగాణల పాలన.. అని తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టిన భారత రాష్టప్రతి అని వుంటే.. అట్లనే చేసుకోవాల. కాని కాలం అట్లాగదు కదా. మరి ఆగని కాలాన్ని ముందలేసుకుని ఇచ్చంత్రాలు మాట్లాడితే పనయిద్దా.. పని అందుకోని పోతనే వుండాలె.. అట్ల పోయే క్రమంలో..మన చుట్టూ వున్న రాజకీయాల్లోకే దిగవలసి వుంటది. బురద అంటుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు లెక్కన.. వ్యవహరించగలగాలె. అట్ల నీటిబొట్టుమాదిరి రాజకీయాలు చేయగలుగుతున్నడు కనుకనే ఇవాళ తెలంగాణ ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోయారు. యెవలో యేందో అనుకుంటరని.. అయి ఇట్లున్నయి అట్టున్నయి.. అనుకుంట గులుక్కోవడం అంటే... గొంగట్లే అన్నం పెట్టుకోని తినుకుంటా యెంటికలొస్తానయి ... అనడం వంటిదే అవుతుంది.
ఎన్నికల వ్యవస్థమీద రోజు రోజుకూ ప్రజల్లో నమ్మకం పోతున్నది. అలా నమ్మకం పోయేలా చేసింది ఎవలు.. ఏడు దశాబ్దాలుగా.. దేశానే్నలుతున్న పాలకులు కావచ్చు... నిన్నటిదాక తెలంగాణను యేలిన వలస పాలనావ్యవస్థ కావచ్చు. అట్లా పోయిన నమ్మకాన్ని తిరిగి సమీకరించుకోగలిగినపుడు మాత్రమే ప్రజలు ఎన్నికల వ్యవస్థ పట్ల విశ్వాసాన్నిపెంచుకుంటరు. ‘‘యెవలు గెలిత్తే మాకేంది.? యెవడొత్తే మాకు వొరిగిందేంది..? మస్తు చూసినం.. అందరు అది చేత్తం, ఇది చేత్తమని చెప్పెటోల్లే.. ఎవలేమీ చేయలేదు.. మీరు గూడ చేసేది లేదు సచ్చేదిలేదుగని...మావోటు గావాల్నా.. అయితే మాయి మాకియ్యి..’’ అని పైసలు డిమాండు చేసేకాడికి వచ్చింది యవ్వారం. నిజం చెప్పాలంటే... అంత ఉద్యమ సమయంలో కూడా ఉప ఎన్నికల సందర్భాల్లో అంతో ఇంతో పొయ్యంది, ఇయ్యంది కుదరలేదు. ‘‘అన్నా మా వోటు కారు గుర్తుకు కాకుంటే యెవలికేత్తమే... మన పార్టీ గాదే. మందికేత్తనానె సచ్చినా యెయ్యను... కాని అన్నా ....అవుతలోడు ఫుల్లు బాటిలు.. వెయ్యి రూపాలిత్తనని వొకటే యెంట పడుతాండు.. వాడు వంద బాటిల్లిచ్చిన వానికెయ్యగని..నువ్వో కోటరన్న ఇయ్యకపోతే..ఇజ్జద్దక్వగాదే మనోల్లకు... అని బాధ పడ్డ నిఖార్సయిన కార్యకర్తలూ వున్నరు. ఇజ్జతికా కఛ్రా.. పరిస్తితి అట్టుంటే.. ఇంకో గమ్మతి పరిస్థతి యేందంటే... ఎవలన్న నిఖార్సయిన వోటరు.. నీను వోటేత్తగని, పైసలు తీసుకోను అంటే నాయకులకు వోటర్లమీదనే అనుమానం వచ్చిన సందర్భాలు ఉన్నయ. అటు వోటర్ల పరిస్థతీ ఇటు నాయకుల పరిస్థతీ .. ఇద్దరి పరిస్థతీ వోటుకు నోటు సుట్టూ తిరుగుతన్న కాలం నుంచి మనం తెలంగాణ స్వయం పాలనలకు ఎంటరయినమనే సంగతిని మరువద్దు.
సంపదను, రాజకీయ అధికారాలను గుప్పిట పట్టుకున్న ఆంధ్రా రాజకీయ వ్యవస్థ.. మెయిన్ స్ట్రీం రాజకీయాలు అర్థం కాని తెలంగాణ వ్యవస్థ.. ఈ రెంటి క్లిష్ట పరిస్తితుల నడుమ తట్టుకోని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని చేరుకోవడం అంటే మామూలు మాటలు కావు. తెలంగాణ సాధన కోసం వో అస్థిత్వ పార్టీ అక్కెరను గుర్తించి దాని స్థాపించి.. కష్టాల నడుమ దాన్ని నిలవెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే కష్ట సాధ్యమైన కార్యాన్ని సాధించిండు కావట్టే కేసీఆర్ వర్తామన రాజకీయ దార్శనికుడుగా దేశం చేత గుర్తించబడుతున్నడు. వచ్చిన తెలంగాణను భగ్నం చేసేందుకు కచ్చె గట్టిన సీమాంధ్ర పాలక వ్యవస్థ.. తెలంగాణ రాష్ట్రాన్ని విఫల తెలంగాణ అని నిరూపించాలె అని పన్నిన కుట్రలను బద్దలు కొట్టి... ఇయాల దేశం గర్వించేట్టు తెలంగాణను ఉన్నతంగా నిలవెట్టిండు కావట్టే ప్రపంచం తెలంగాణ గురించి చర్చిస్తున్నది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్నంటే...
పట్టిన పంతం వదులకుంటా.. వొ పదిరివై యేండ్లు నిజాయితీగా చిత్తశుద్దితో తమ కోసం పోరాటం చేసేటోల్లనే ప్రజలు నమ్ముతరనే విషయం అర్థం కావడానికి. అటువంటి నాయకున్ని మాత్రమే ప్రజలు అనుసరిస్తరు. అటువంటి విశ్వాసం వొక నాయకుని మీద రావాలంటే.. యేం చేయాలె.. వాల్ల జీవితాల్లో గుణాత్మక మార్పుకు క్రుషి చేయాలె. వారి ఆకాంక్షలను పసిగట్టి అందుకు అనుగుణమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోని అమలు పరచాలె. ఉద్యమంలోనే కాదు, ప్రభుత్వాన్ని స్థాపించీ అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు పూర్తి విశ్వాసంలోకి తీసుకున్నరు. కేసీఆర్‌కు ఏనాటికీ ప్రత్యామ్నాయం లేదనేది ఇప్పటికే స్పష్టమైంది. ఎందుకంటే ప్రజలకు మేధావుల కంటే ఎక్కువ రాజనీతి తెలుసు.
ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన కోదండరాం గురించి చెప్పుకోవాలంటే.. ఆయన తన స్వయం కృషితో సొంతంగా యెదిగిన నాయకుడు కాదు. జెఎసి చైర్మన్‌గా కేసీఆర్ నామినేట్ చేస్తే నిలవడ్డడు. అయ్యాల్టినుంచి తెలంగాణ వచ్చిందాక.. టిఆరెస్ పార్టీ పెట్టుకున్న ఖర్చులు రయాలె.. తప్ప.. పాపం మాజీ ప్రొఫెసర్కు పైసలు గుంజుకొచ్చుడేమెర్క.. ఖర్చు పెట్టుడేమెరుక. టిఆరెస్ బలం మీద, పెద్దమనిషి తనం మీద నూక్కొచ్చిండు. అయితే.. ప్రభుత్వాలను ప్రజా సమస్యలమీద ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే సోషల్ విజిల్ బ్లోయర్ పాత్ర వేరు.. ప్రజా సమస్యలను పరిష్కరించే రాజకీయ నాయకత్వం వేరు.. రుూ రెంటికీ వుండే సన్నని గీతను కాంగ్రెస్ మాయలపడి చెడిపేసే ప్రయత్నం చేస్తున్న మాజీ ప్రొఫెసర్ తన రాజకీయ అడుగులను ఎట్లా వేస్తడో చూడాలె.
యేది యేమయినా వొక పార్టీ పెట్టడం, దాన్ని ప్రజల ముందుకు తీసుకపోవడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే.. ఆ పార్టీ నాయకత్వానికి పాజిటివ్ థింకింగ్ వుండాలె. గిలాసల వున్న సగం ఖాళీని కాదు చూడాల్సింది.. సగం వున్న నిండుదనాన్ని. కేసీఆర్‌ను గద్దె దించుడే మా లక్ష్యం అని పార్టీ పేరు ప్రకటించిన దినమే అక్కసు కక్కడం కోదండరాం తప్పుడు ఆలోచనా విధానానికి సంకేతాన్నిచ్చింది. నెగెటివ్ ఆలోచనా విధానాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదించరు. ఆనాడు ఉద్యమంలో కూడా అంగీకరించలేదు. మమ్ముల జెఎసీలకు రానిస్తలేడు అని ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన మేధావులు నాయకులు కోదండరాంను కోప్పడుతుంటే.. పోనీయరాదే.. ఆయినో పనిచేత్తాండు- నువ్వో పని చేయరాదు.. ఎవలు చేసినా ఉద్యమం కోసమే కదా.. అని సముదాయించెటోల్లు జనం. కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషాన్ని వెల్లగక్కడం ద్వారా.. తాను వ్యతిరేకించిన నెగెటివ్ విధానానే్న తాను అనుసరించాల్సిన పరిస్తితిలోకి నెట్టబడ్డట్టయింది ఫ్రొఫెసర్‌కు. యెవరు గద్దెనెక్కుతరో, ఎవలు దిగుతరో ప్రజలే నిర్ణయిస్తరు.. బరువు ఎంతుందో ఎత్తుకుంటేనేగా తెలుస్తది. వొడ్డున ఉత్తగ కూకుంటె ఎట్ల తెలుస్తది?

- రమేశ్ హజారి సెల్: 93909 19090