AADIVAVRAM - Others

పులకింతల పూలవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సోయగాలకు నిలయమైన కాశ్మీరులో ప్రతి సంవత్సరం నిర్వహించే తులిప్ పూల పండుగ అక్కడి అందాలకి మరింత సొబగుల్ని అద్దుతుంది. మంచుకొండల మధ్య దాల్ సరస్సు తీరంలో విరబూసే తులిప్‌ల అందాలను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.. వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌తో పాటు మరికొన్ని తోటల్లో తులిప్ అందాలు సందర్శకులను మైమరపిస్తాయ. ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతి పెద్దది. దాదాపు పాతిక ఎకరాల విస్తీర్ణంలో, డెబ్భైకి పైగా జాతులకు చెందిన సుమారు ఇరవై లక్షల తులిప్ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. సాధారణ తులిప్‌లతో పాటు వివిధ రంగులలో వైవిధ్యమైన తులిప్‌లు ఇక్కడ విరబూస్తుంటాయి. ప తి సంవత్సరం వసంతకాలంలో జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ నేతృత్వంలో మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పదిహేను వరకూ ఇక్కడ ‘తులిప్ ఫెస్టివల్’ జరుగుతుంది. దీన్ని ‘బహర్ ఎ కాశ్మీర్’గా పిలుస్తారు. ఈ ప్రదర్శనకు వేలాంది సందర్శకులు తరలివస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక కళా బృందాలు కాశ్మీరీ సంప్రదాయ గీతాలాపన, నృత్యాలను ప్రదర్శిస్తాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల స్టాల్స్ కూడా తులిప్ పండుగ సందర్భంగా కొలువుతీరుతాయి.