Others

ప్రకృతి పహారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలో కాగుతున్న
ఆ కానుగ చెట్టు
నాకు మిట్టమధ్యాహ్నం
నదీ స్నానం చేసినట్లుంది!

నీడ పట్టునే్న ఉండే నాపై
ఆ చెట్టుకెందుకంత మమకారం?
పరహితార్థంగా పాఠం చెబుతున్నట్లుంది

వేడిమిని ఎదిరించి
మూలకు కూర్చున్న ఆ మట్టికుండ కూడా
నా దాహానికి చలువ పందిరి వేస్తున్నది
నేనేం ప్రత్యుపకారం చేయకపోయనా
మట్టి ఇంకా రక్తస్పర్శన కోల్పోలేదు!

రోజంతా తాపంతో డస్సి
ఆరుబయట నడుం వాలుస్తానా
చంద్రుడు శీతల కిరణాలతో సేద తీరుస్తాడు
మా మామా అల్లుళ్ళ అనుబంధం ఈనాటిదా?

చారెడు నీళ్ళు పోసినందుకే
ఇంటెనక మల్లెచెట్టు
గాలికి సుగంధాన్నద్దుతుంది

రాత్రేమి తక్కువ తిన్నది కాదు
అలసిన నా దేహానికి మరునాటికి
జవసత్వాలద్దేది అదే!

ప్రకృతిలా పహారా కాయందే
ఈ వేసవిలో మనిషి నేలమీద మిగుల్తాడా?
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261

తూటాలకు మాటలేల?
నిశ్శబ్ద సమరం చేసే
తూటాలకు మాటలెందుకు?
తుపాకీ చాలు!
వౌన సంస్కృతిని మారణ హోమంగా
మార్చేయడానికి
మాటలతో పనేంటి?
వాదాలన్నిటి వాస్తవ రేఖ
తీవ్రవాద తీరంలో
విప్లవ కెరటమై విరిగిపడితే
మానవాళికి మనుగడెక్కడ?
మంచితనానికి చోటెక్కడ?
మనో క్షేత్రాలన్నీ కురుక్షేత్రాలై
మనోభీష్టాలన్నీ మానవారిష్టాలై
రక్షణ కరువైన జీవన నేపథ్యం
సంభవామి యుగే యుగే అని
ఎలా విశ్వసించగలదు?
సహనమే మన జీవన విధానమని
ఎలా అనుసరించగలదు?

- మరువాడ భానుమూర్తి

పాపం పూలతోట
తియ్యనైన మాటల చిలుక
మాట మరిచినదట
కమ్మనైన పాటల కోకిల
పాట మరచినదట
అద్భుతమైన ఆటల మయూరి
ఆట మరిచినదట

మాట పాట ఆటలతో
పులకించి మైమరచి
ఉత్సాహ భరితంగా
వికసించే పూలతోట
చిలుక మాట లేక...
కోకిల పాట లేక...
మయూరి ఆట లేక...
పూల తోట చిన్నబోయనదట!
వాటి రాక కోసం కన్నార్పకుండా
క్షణమొక యుగంగా గడుపుతోందట
ముక్కోటి దేవుళ్లకు మ్రొక్కుతోందట!

తను చేసిన నేరమేమని...
అయన ఇంతటి శిక్షా అని
అనుక్షణం తనను తాను
పరీక్షించుకుంటోందట!
నీవైనా చెప్పరాదేనని
గాలిని బ్రతిమిలాడుతోందట!

ఎగిరిపోయన చిలుక
మూగబోయన కోయల
అలిగిపోయన నెమలి
ఏనాటికైనా రాకపోతాయా అని...
అలరించకపోతాయా అని...
పేరాశతో బ్రతుకుతోందట!
పాపం పూలతోట!!

- పల్లోలి శేఖర్‌బాబు, 9490484316