Others

హోమియో వైద్య విధానానికి ఆద్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం...

ఏప్రిల్ 10వ తేదీని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు హోమియో వైద్య పితామహుడు డా.శామ్యూల్ హానె్నమాన్ పుట్టినరోజు.
ప్రపంచంలోని వైద్య విధానాలలో అల్లోపతి అనే ఆధునిక వైద్యం (ఇంగ్లీషు వైద్యం) మొదటి స్థానం ఆక్రమించింది. దాని తర్వాత ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక వైద్య విధానాలున్నాయి. హోమియోపతి వైద్యం 2వ స్థానంలో ఉంది. డబ్ల్యుహెచ్‌ఓ హోమియోపతి వైద్యాన్ని రెండవ అతి పెద్ద వైద్య విధానంగా గుర్తించింది. 66 దేశాలలో ఈ వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచమంతటా ఏటా 8400 కోట్ల రూపాయల మందులు అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలో హోమియోపతి వైద్య మార్కెట్ 42వేల కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఎక్కువగా భారతదేశంలోనే ఆదరించబడుతున్నది. వైద్య కళాశాలలు, ఫార్మసీలు, రీసెర్చ్ సెంటర్లు, హాస్పిటల్స్ భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశ జనాభా ఎక్కువ, పేదలు ఎక్కువ. అందువల్ల ఈ విధానం మనకెంతో అనుకూలమైన వైద్యం. హోమియోపతి ఆస్పత్రి నిర్వహణ ఖర్చు తక్కువ. మందుల వెల స్వల్పం. హానికరం కావు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కఠిన దీర్ఘ వ్యాధులకు ఈ వైద్యంలో మంచి ఫలితాలున్నాయి. మెదడువాపు వ్యాధి, చికున్‌గున్యా, డెంగ్యూ, చికెన్‌పాక్స్, స్వైన్‌ఫ్లూ, మద్రాస్ ఐ (కళ్ల కలక), గవదల వాపు, కలరా, అతిసార మొదలగు ఎన్నో అంటువ్యాధులకు హోమియోపతియే జవాబు. అంటువ్యాధులకు ముందు జాగ్రత్త చర్యలుగా హోమియపతి మందులను వాడి వ్యాధులను ప్రబలకుండా నివారించవచ్చు. ఇంతటి గొప్ప వైద్య విధానాన్ని ప్రపంచానికి అందించిన పితామహుని జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హానె్నమాన్ 1775వ సం. ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలోని మిస్సెల్ అను కుగ్రామంలో జన్మించాడు. నిరుపేద కుటుంబం. తండ్రి పింగాణీ పాత్రలపై రంగులు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు 10 మంది సంతానం. బాల్యదశలోనే హానె్నమాన్ అసాధారణ ప్రతిభ కలవాడు. విద్యార్థి దశ నుండి వినయం, శ్రద్ధ, పట్టుదల మొదలగు సద్గుణాలు కలిగి ఉపాధ్యాయుల మన్నన పొందాడు. కాని హానె్నమాన్‌కు స్కూల్ ఫీజు కట్టలేక అతని తండ్రి స్కూల్ మానిపించాడు. కాని ఆయన ఉపాధ్యాయుడు హానె్నమాన్ ప్రతిభ చూసి ఫీజు లేకుండా చదువుకొనే ఏర్పాటు చేశాడు. అప్పటికీ కుటుంబం గడవడం కష్టమై విద్యార్థులకు పాఠాలు చెప్పి, ఇతర భాషలలో ఉన్న గ్రంథాలు తర్జుమా చేసి వచ్చిన డబ్బుతో కుటుంబానికి ఆర్థిక భారం లేకుండా జీవించేవాడు.
ఆయన తన 24వ ఏట 1779లో వైద్యశాస్త్రంలో ఎంబిబిఎస్ పట్టా పుచ్చుకున్నాడు. 1782లో నవంబర్ 17వ తేదీన హెన్‌రియట్ అను వనితను పెళ్లాడాడు. హానె్నమాన్ వైద్యవృత్తిలో (అల్లోపతి) దాదాపు 10 సంవత్సరాలపాటు వివిధ పట్టణాలలో వైద్యం చేశాడు. ఆయన ప్రావీణ్యత గల వైద్యుడేగాక, గొప్ప శాస్తవ్రేత్తగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందాడు. చిన్న వయస్సులోనే డెస్టెన్ హాస్పిటల్‌లో ప్రధాన శస్తచ్రికిత్స అధికారి అయ్యాడు. కొంతకాలానికి తాను చేస్తున్న వైద్య విధానమందలి లోపాలను గమనించి, దీర్ఘవ్యాధులు నివారణ కాకపోవడం, పదేపదే వ్యాధులు తిరగబెట్టడం నచ్చక వైద్యవృత్తిని విడిచిపెట్టాడు.
వైద్యవృత్తి మానివేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండుటకు, సంసారాన్ని పోషించుకొనేందుకు ఎన్నో గ్రంథాలను తర్జుమా చేశాడు. ఆయనకు ఇంగ్లీష్, ఇటలీ, ఫ్రెంచ్, గ్రీకు, లాటిన్, అరబిక్ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఎందరో సైంటిఫిక్ పబ్లిషర్స్ ఆయన రచనలు, అనువాద గ్రంథాల కోసం ఎదురుచూసేవారు.
1790లో డా.కల్లెన్‌చే వ్రాయబడిన మెటీరియా మెడికా తర్జుమా చేస్తూన్న సమయంలో అనుకోకుండా హోమియో వైద్య ముఖ్య సూత్రాలను కనుగొన్నాడు. సింకోనా అనే మందు గురించి డా.కల్లెన్ రాసిన వ్యాఖ్యానం ఆయనకు నచ్చలేదు. అంవల్ల సింకోనా మందు తీసుకొన్నట్లయితే ఆ మందు చలిజ్వరాల నివారణ విషయం తెలుస్తుందని కొన్ని రోజులు సింకోనా మందును ముడిరూపంలో తానే స్వయంగా తీసుకొన్నాడు. ఇలా తీసుకున్న తర్వాత ఆయనలో చలి జ్వర లక్షణాలు కనిపించాయి. అదే లక్షణాలున్న రోగికి సింకోనా ఇవ్వడం వలన వ్యాధి నివారణ కలిగింది. విప్లవాత్మకమైన ఈ ప్రయోగం చికిత్సా రంగాన్ని మొత్తం ప్రక్షాళన చేసింది. ఈ విధంగా ఆయన మీద ఆయన శిష్యుల మీద కుటుంబ సభ్యుల మీద వివిధ మందులను 40 సంవత్సరాలు ప్రయోగించి వాటి వలన కలుగు లక్షణాలు క్రోడీకరిచి మెటీరియా మెడికా ప్యూరా అనే గ్రంథాన్ని రాశాడు. ఈ విధంగా అనేక సంవత్సరాలు రాత్రింబవళ్లు అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషి ఫలితంగా హోమియో వైద్యం ఆవిర్భవించింది.
ఈ నూతన విద్యా విధానాన్ని ధృవపరచుటకు, నిలబెట్టుటకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇతర వైద్యులు ఈ విధానాన్ని ఆధారరహితంగా ఉన్నదని విమర్శించారు. వారి చర్యల వలన ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి మారాల్సి వచ్చింది. ఈ నూతన విధానం వలన జర్మనీ దేశంలోని మందుల కంపెనీలకు నష్టం వాటిల్లటంతో వారు ఆయనను లీప్జిగ్ పట్టణం నుండి వెళ్లగొట్టారు. తర్వాత కోథెన్ అను పట్టణం చేరి డ్యూక్ ఫెడ్రిక్ సహాయంతో తన వైద్య విధానాన్ని ప్రారంభించాడు. ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. దీర్ఘవ్యాధుల నిజ స్వరూపం తెలుసుకొనేందుకు ఆయనకు 12 ఏళ్లు పట్టింది. అనేక దీర్ఘకాల వ్యాధుల వారు ఆయన చికిత్సచే బాగుపడ్డారు.
1830 సంవత్సరంలో ఆయన భార్య మరణించింది. ఆయనకు ఇద్దరు కుమారులు, 9 మంది కుమార్తెలు. 1835న మెలనీడి హెర్విల్లీ అనే 36 సంవత్సరాల విద్యావంతురాలు ఆయన ప్రతిభకు ఆకర్షింపబడి వివాహం చేసుకొంది. ఆమె పలుకుబడి వలన ఫ్రాన్స్ దేశ ముఖ్య పట్టణమైన పారిస్ నగరంలో వైద్యం చేసేందుకు ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. వృద్ధాప్యంలో ఆయనకు ఆమెయే రోగులకు మందులిస్తూ సహాయపడింది. తన 88వ ఏట 2.7.1843న ఆ మహనయుడు దేహాన్ని చాలించాడు. ఆయనను తరిమికొట్టిన లీప్జిగ్ ప్రజలు ఆయన మరణానంతరం 20 సంవత్సరాల తర్వాత ఆయన శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

-జనార్దన నుగ్గు 9441684525