Others

పరిశుభ్రతను పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు కదా. అంటే ఇంటి పరిశుభ్రత గురించి ఈ మాట వచ్చింది. ఇక్కడ ఇల్లాలు అన్నారు కనుక కేవలం పరిశుభ్రత ఆడవారిదే అనుకోకండి ఇంట్లోని అందరి సభ్యుల బాధ్యత పరిశుభ్రత అపుడే ఆ ఇల్లు పరిశుభ్రతతో కళకళలాడుతుంది.
ఇల్లును ప్రతిరోజు తడిబట్టతో తుడవలేనివారు వారంలో రెండుమూడు సార్లు అయినా ఫినాయిల్ నీళ్లల్లో కలిపి తుడుస్తుండాలి. చెత్తను ఏ మూల ఉంచకుండా చూసుకోవాలి. పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తినేసి ఆ రేపర్లు మంచాల కింద సోఫాల కింద పడేస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు తీసివేయడం పిల్లలకు నేర్పించాలి. వాటిని చెత్తబుట్టల్లో వేసేటట్లుగా వారికి నేర్పించాలి. లేనట్లు అయితే ఆ రేపర్ల చుట్టూ చీమలతో పాటు చిన్న చిన్న పురుగులు చేరుతాయి. బొద్దింకలు కూడా వస్తుంటాయి. ఒకవేళ చిన్నచిన్న పురుగులు తిరుగుతూ ఉంటే కదల్చకుండా ఉండే సోఫాలు, గ్యాస్ సిలెండర్లు, బియ్యం డబ్బాలు ఇలాంటి వాటి చుట్టూ క్రిమి సంహారక మందులతో పాటుగా పసుపు ఉప్పు కలిపి వేసినట్లుఅయితే ఆ పురుగులు దూరం అవుతాయి.
వారంలో కనీసం రెండు సార్లు అయినా కిటికీల్లో చేరిన దుమ్మును దులుపుకుంటూ ఉండాలి. ఈమధ్య చిన్నచిన్న బూజు కట్టెలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.వాటిని వాడి దుమ్మును దూరం చేసుకోవచ్చు. దుమ్ము దులిపేటపుడు ఆ కిటికీల దగ్గర ఉన్న సామానుపై ఏదైనా గుడ్డను కప్పడం వల్ల ఆ దుమ్ము వీటిపై పడకుండా ఉంటుంది.
వంటిట్లో క్రిమి సంహార మందులను జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఆహారపదార్థాలు నిల్వ అక్కడ ఉంటుంది కనుక వాటికి జాగ్రత్తగా మూతలు వేయాలి. వంటింట్లో ఉండే సింకుల్లో చెత్త చేరి అవి నిండిపోయి నీరు పోవడానికి అడ్డంకులుగా తరచు మారుతుంటాయి. కనుక అవి చెత్తతో నిండి పోకుండా చెత్తను ఎప్పటికప్పుడు తీసివేయడం కాని, లేకపోతే ఈ జాలిలో కాస్త బేకింగ్ పౌడరు వేసి దాని పైన కాస్త వెనిగర్‌ను చల్లి , ఆపై కాస్త గోరువెచ్చటి నీరు పోసినట్టయితే అక్కడ అంతా నురుగు ఏర్పడి ఆ చెత్తను దూరం చేసి ఆ సింకు గొట్టాన్ని శుభ్రం చేస్తుంది. నీళ్లు సాఫీగా వెళ్లిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి కూడా జాగ్రత్తలు పాటించాలి.
వంటిట్లో వేడి గినె్నలు పట్టుకోవటానికి వాటే టవల్స్‌ను వేడినీటితో ఉతికి వేయాలి. వాటి మురికి బట్టలసోడాను ఉపయోగించి వదిలించుకోవాలి. మంచి ఎండ తగిలే చోటున వాటిని ఆరవేయాలి.
ఇత్తడి సామానులు తోమేటపుడు కుళ్లిన టమాటాలను, పారవేసే నిమ్మతొక్కలను ఉపయోగిస్తే అవి మిలమిలా మెరుస్తాయి. వంట చేసేటపుడు చిన్న బుట్టను దగ్గరగా పెట్టుకొని కూరలు తరిగేటపుడు, చింత పండు రసం తీసుకొన్నప్పుడు వచ్చిన పిప్పిని ఆ బుట్టలో వేసుకొని వంట పూర్తి అయిన తర్వాత అసలు చెత్తబుట్టలోకి వంపడం వల్లవంటింట్లో శుభ్రంగా ఉంటుంది.
*