Others

గురువు జీవితాశయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు సముద్రంపై ప్రయాణం చేసిన కొలంబస్‌లా ఉండాలి. విద్యారంగం ఒక మహా సముద్రం. ఎంతోమంది మహనీయులు తమ జీవితాన్ని ధారపోసినటువంటి క్షేత్రం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు దీక్షతో, పట్టుదలతో చదువు చెప్పవచ్చు. కానీ విద్యారంగం చాలా విశాలమైంది. కాబట్టి ఆ రంగంలో ఇతర ఉపాధ్యాయులు కూడా ఏమేమి ప్రయోగాలు చేస్తున్నారు? ఆ ప్రయోగాలు నా తరగతి ఉన్నతికి ఏ విధంగా ఉపయోగపడతాయి? అనే ఆలోచన కూడా గురువులో ఉండాలి. బోధనారంగంలో ఉన్న సహచర ఉపాధ్యాయులను కలవటం, సమావేశాల్లో వారితో మాట్లాడటం, ఇతరుల ప్రయోగాలను కూడా పరిశీలించటం ఉపాధ్యాయులు తమ విధిగా భావించాలి. తనకు తాను సంతృప్తికరంగానే పనిచేయవచ్చు. కానీ ఇది విశాల విశ్వం. ఎంతోమంది మహనీయులు తమ తపస్సును ధారపోసిన క్షేత్రం. కొత్త భావాలు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవాలి.
అందుకే తరగతి గది కొలంబస్ ప్రయాణం. తన గమ్యం తెలియక పోయినా- కొలంబస్‌కు తన సంకల్పమే బలం. కానీ సముద్రంలో ఏ పడవ ఎక్కడికి పోతున్నదో పరిశీలించేవాడు. తన పడవ దిశను మార్చుకునేవాడు. స్థిరమైన అభిప్రాయాలతో, అన్నీ నాకు తెలుసు అనే భావనతో ఉండకుండా ఇతరుల అనుభవాలతో తరగతి గది యోగ్యతను గురువు పెంచవచ్చు. అపుడే విద్యార్థులు ప్రపంచంలో రాణిస్తారు. మా ఉపాధ్యాయుడు మాకు న్యాయం చేశాడని విద్యార్థులు భావిస్తారు. ఈ లక్ష్యంతో విద్యా రంగంలో పయనించాలి. ఇలాగే ఇండియాకు పోదామనుకున్న కొలంబస్ ఒక కొత్త ఖండాన్ని కనుక్కోగలిగాడు. విద్యార్థులు ఆవిష్కర్తలు కావాలంటే ఉపాధ్యాయుడు కొలంబస్ కావాలి. అద్భుతాలు సాధించిన తన విద్యార్థి సన్మానం పొందుతుంటే ఉపాధ్యాయుడి కళ్లనుంచి ఆనందబాష్పాలు రాలాలి. అదే ఉపాధ్యాయుని జీవిత ఆశయం కావాలి.

-చుక్కా రామయ్య