Others

మారని ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమ’ అన్న మాట ఈ రోజున ఎక్కడ చూసినా వింటూనే ఉన్నాం. ఐతే, ఆ ప్రేమ స్వచ్ఛమైనదా? నిర్మలమైనదా? కేవలం ఆకర్షణా - అంటూ దాన్ని విశే్లషించుకోవటంతోనే సరిపోతోంది. ప్రేమ అనేది లేదూ అంటూ చెప్పేవాళ్లూ ఉన్నారు. ప్రేమే జీవితం అన్న వాళ్లూ ఉన్నారు. కానీ- ప్రేమ శాశ్వతమైనదా? ఇలా వచ్చి అలా వెళ్లిపోయేదా? ప్రేమ చల్లారి పగల సెగల ఎగసిపడుతున్న ఈ రోజుల్లో ఎటూ చూసినా ఎక్కడ చూసినా.. ఇంటా బయటా.. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ.. రాష్ట్రాలకూ రాష్ట్రాలకు మధ్య, దేశాలకు దేశాలకు మధ్య ఆరని మంటలు చెలరేగుతున్న వాస్తవ పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తూ మనసున కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. వీటి మధ్య దేవుని ప్రేమని మర్చిపోతున్నామా? స్పష్టంగా చెప్పాలంటే మర్చిపోతున్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించటమే కాదు.. తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పాప పరిహారార్థ బలిగా పంపించాడు. పరలోక ప్రేమను యేసుక్రీస్తు రూపంలో మన మధ్య నాటాడు. మారని ప్రేమను, ఆరని ప్రేమను, ఆర్పజాలని ప్రేమను, అతి శ్రేష్ఠమైన ప్రేమను, అంతం లేని ప్రేమను, అవధుల్లేని ప్రేమను, అత్యున్నతమైన ప్రేమను, నిష్కపటమైన ప్రేమను, నిష్కళంక ప్రేమను, కలువరి సిలువలో లోకానికి చూపాడు.
యోహాను 13:34 లో ప్రభువు కొత్త ఆజ్ఞను లోకానికి ఇచ్చాడు. ‘నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి’.
క్రీస్తు మనలను ప్రేమించి తన్నుతాను బలిగా అర్పించుకొన్నాడు. మన పాపం నిమిత్తం ఎన్నో అవమానాలను పొందాడు. హేళన చేయబడ్డాడు. దూషించబడ్డాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. మోయలేని సిలువను వీపున మోసాడు. ముళ్ల కిరీటం భరించాడు. అయినా ఆయన తన ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు. ‘వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. కనుక వీరిని క్షమించమ’ని తండ్రిని వేడుకొన్నాడు.
1 కొరింథి 13:4-7 లో ఉన్న ప్రేమ లక్షణాలను ఆయన జీవితం ద్వారా మనకు చూపించాడు.
ప్రేమ: దీర్ఘకాలం సహించును. మత్సరపడదు. దయ చూపించును. డంబముగ ప్రవర్తించదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనాన్ని విచారించుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక, సత్యమందు సంతోషించును. అన్నిటిని తాళుకొనును. అన్నింటిని నమ్మును. అన్నింటిని నిరీక్షించును. అన్నిటిని ఓర్చును.
శ్రేష్టమైన ఈ ప్రేమ లేకుండా దేవదూతల వలె మాట్లాడినా, మంచి జ్ఞానమున్నా, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసమున్నా, బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినా, కాల్చబడుటకు శరీరము ఇచ్చినా ప్రయోజనం లేదు.
క్రీసు చూపించిన ఈ ప్రేమను మనం అలవాటు చేసుకొని, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. పగలు చల్లారి, ప్రేమలు పెరిగి, కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు సంతోష సుఖ శాంతులతో ఉంటాయి. ఈ ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడాలి. స్వార్థాన్ని, అసూయనూ, పగల సెగలను పక్కనబెట్టి ప్రేమలు పండించి సంతోషంగా సమాధానంగా జీవిద్దాం.
*

-మద్దు పీటర్ 9490651256