Others

మమ్మల్ని క్షమించొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులాల పునాదులు
కూల్చాలన్నావు,
గోత్రాల వారీ అడ్డుగోడలు
కడుతున్నాము

సమానత సాధ్యం చేసే రాజ్యం కోరావు
అసమానతలకు ఆజ్యం పోసే పనిలో ఉన్నాము

పౌరుని గౌరవం పెంచే పాలన కలగన్నావు
పౌర హక్కులు తొక్కే పాపాలను మోస్తున్నాం

సత్తువ నిండే సకల జన శ్రేయోరాజ్యం కోరి,
ఉత్తమ రాజ్యాంగం మాకందించావు
ఆ స్ఫూర్తిని మరిచి, ఉత్తుత్తి భక్తిని నటిస్తున్నాం
అసలుదారిని మరుస్తున్నాం.. ఏమారుస్తున్నాం.

బాబాసాహెబ్ అంటూ
వీధికో విగ్రహాన్ని పెడుతున్నాం
పూటకోమారు, ఓటుకో మారు
నీ పేరు తలుస్తున్నాం
నువ్వు చెప్పిన మాట పెడచెవిన పెట్టేస్తున్నాం
నువ్వు చూపిన బాట ఏనాడో విడిచి వచ్చాం.
మమ్మల్ని క్షమించొద్దు... ఆ అర్హత కోల్పోయాం.

- డా.డి.వి.జి.శంకరరావు సెల్: 94408 36931