AADIVAVRAM - Others

ఖరీదైన కేకుగు(బొ)మ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లచీరకు తకదిమి తపనలు రేగేనమ్మా సందె ఎనె్నల్లో.. అని పాడాలనిపిస్తోంది కదూ ఈ గుమ్మను చూస్తుంటే.. కాస్త సరిగ్గా పరిశీలించి చూడండి.. ఇక్కడున్నది గుమ్మ కాదు ముద్దు బొమ్మ. అలాంటిలాంటి బొమ్మ కాదండోయ్ ఇది. కేకు బొమ్మ. పెళ్లికూతురు బట్టలు, అలంకరణతో ముస్తాబైన ఈ అందాల బొమ్మను దుబాయ్‌లోని ఓ వెడ్డింగ్ సంస్థ ప్రదర్శనకు పెట్టింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కేకుల్ని తయారుచేసే డెబ్బీ వింగ్‌హామ్ ఈ కేకుని రూపొందించాడు. ఆరడుగుల ఎత్తు, వంద కిలోల బరువున్న ఈ కేకును తయారుచేయడానికి అతనికి పదిరోజుల సమయం పట్టిందట. ఇంత కష్టపడి చేసిన ఈ కేకు విలువ తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే.. ఈ కేకు ఖరీదు అక్షరాలా ఆరున్నర కోట్ల రూపాయలు. ఎంత అందమైన అమ్మాయి బొమ్మ అయితే మాత్రం కేకుకు అంత డబ్బు ఎందుకండీ.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి ఈ కేకు తయారీలో ఐదు విలువైన వజ్రాలు, వెయ్యిదాకా విలువైన ముత్యాలు వాడారు మరి. వీటిని మినహాయిస్తే ఈ కేకును మొత్తం అచ్చంగా లాగించేయొచ్చు. ఇంత అందమైన వజ్రాలు పొదిగిన కేకు ఆ మాత్రం ఖరీదు చెయ్యదూ..