Others

తెలంగాణ సినిమా ఉనికి -ఎదుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్ రివ్యూ.....

తెలంగాణ సినిమా- దశ దిశ (వ్యాసాలు)
రచన: వారాల ఆనంద్,
ప్రజాపొయట్రీ ఫోరం,
వెల: రూ. 120/- పేజీలు: 142,
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలలో

వారాల ఆనంద్ కవి, రచయిత, సినీ విమర్శకుడు. సినిమాల పట్ల విపరీతమైన ప్రేమ కలిగిన ఆనంద్ ఫిలిం క్లబ్ నిర్వాహకుడిగా, లఘుచిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా- సినీ పరిశ్రమకు సంబంధించిన తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు విశే్లషిస్తూ పాఠకులను జాగరూకం చేస్తుంటాడు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కొన్ని మార్గదర్శక సూత్రాలను పలు వ్యాసాల రూపంలో వివిధ పత్రికలలో వెలువరించారు. అలాగే భారతీయ సినిమా ప్రపంచ సినిమాల్లో వస్తున్న మార్పులను వివిధ పరిణామాలను ఆసక్తికరంగా వివరిస్తారు.
అనేక రకాలుగా వినూత్నంగానూ, విలక్షణంగాను ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ‘‘తెలంగాణ సినిమా- దశా, దిశా’’ను మార్చాల్సిన అవసరముంది. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పరాయిభావాలతో వున్న సినిమాల్ని చూడాలా? అలా కాకుండా ఖచ్చితంగా ‘‘మన రాష్ట్రం- మన సినిమా’’రావాల్సి వుంది. అదీ ఉద్యమరూపంలో ఎదగాలి. ఇక ‘‘ఏది తెలంగాణ సినిమా’’అని ప్రశ్నిస్తూ, దాన్ని చర్చించిన విధానం అనేక విషయాలను తెలియజేస్తుంది.
చిన్నచిన్న బడ్జెట్‌లతో తెలంగాణ గొప్పదనాన్ని విలక్షణతని డిజిటల్ మాధ్యమంలో ‘షార్ట్ ఫిలిమ్’లుగా నిర్మించి విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడంతోపాటు, డిజిటల్ చలనచిత్రోత్సవాల్ని అన్ని జిల్లాలలో, దేశంలోని అన్నిప్రాంతాలలో నిర్వహించగలిగితే గొప్ప ఫలితాల్ని సాధించే అవకాశముంది. ప్రస్తుతం యువత ఏవో ఒక రకంగా షార్ట్ ఫిలిం తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అలా కాకుండా గొప్ప సినిమాల్ని చూడడం, నేర్చుకోవడం, నిర్మించడం సమాంతరంగా చేసినప్పుడే మనదైన సినిమా, మంచి షార్ట్ సినిమా తయారవుతుంది. తెలంగాణ సినిమాకోసం కొత్తగా ఆలోచించే యువకులు క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి) విధానాన్ని వినియోగించుకోగలిగితే విజయాలను సాధించవచ్చు. దానికి స్పష్టమైన ప్రాజెక్టును ప్రతిపాదించగలిగితే క్రౌడ్ ఫండింగ్‌ను ఆకర్షించగలం. కొత్తతరానికి కాలేజీల్లోనూ, స్కూళ్ళలోనూ క్యాంపస్ ఫిలిం క్లబ్బులు ఏర్పాటుచేసి ఉత్తమ చిత్రాలను ప్రదర్శించి చర్చాగోష్టులను నిర్వహిస్తే, వారికి మంచి సినిమాపై అవగాహన ఏర్పడుతుంది. గతంలో డాక్యుమెంటల్‌ల లాగా ఇప్పుడు వీడియోతో తీసిన డీవీడీలను ‘విజువల్ బుక్స్’ పేరిట సాహిత్యకారుల జీవిత సాహిత్యాలను రికార్డుచేయడం ఎలా మొదలయిందో వివరించారు. విద్యార్థులకోసం పాఠశాల స్థాయినుంచే విజువల్స్‌కు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించాలి. చిన్నవయసులోనే వాళ్ళ మనస్సుల్లో వెలుగులు నింపే ప్రయత్నం జరగాలి. ‘విజువల్ లిటరసీ’ని పెంపొందించాలి. ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ అకాడమీ, ఫిలిం ఇన్‌స్టిట్యూట్, ఫిలిం డివిజన్ లాంటి సంస్థలను నిర్మించడంతోపాటు ‘్ఫలిం టూరిజం’ను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. సాంకేతిక పరిణామక్రమంలో రూపుదిద్దుకుని ఇవాళ అత్యంత ప్రతిభావంతమైన మాధ్యమంగా ఎదిగిన ప్రపంచ సినిమాను హైదరాబాద్ నగరానికి రప్పించి, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వేదికగా చేయాలి.
సినిమా ‘కళా, సాంకేతికమో, వ్యాపారమో’అని చర్చిస్తూ, అన్నీ కలగలసి వుంటేనే ప్రజలకు చేరువ అవుతుందనడం బాగుంది. ఉత్తమ సాహిత్య విలువలుగల రచనలు, తెలంగాణ సినిమాలుగా రూపుదిద్దుకున్న క్రమాన్ని తెలియజేశారు. వివక్షలోనూ తెలంగాణ కళాకరులు పైకెదిగి, పేరుప్రఖ్యాతులు గడించిన వైనాన్ని తెలియజేశారు. వారిలో కళాత్మక దర్శకుడు బి.నరసింగరావు, సీనియర్ దర్శకులు బి.ఎస్.నారాయణ, టి.మాధవరావు, హిందీ చిత్ర సీమలో వెలుగొందిన హీరో పైడి జైరాజ్, విలన్ అజిత్‌ల కృషి- గొప్పదనాన్ని విడివిడి వ్యాసాల్లో వివరించారు. తెలుగు సినిమాకు, సినీ కళాకారులకు సామాజిక బాధ్యత వుండాలంటారు. అతిపెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన తెలుగు పరిశ్రమ ఫార్ములా, ఇమేజ్ లాంటి చట్రాలకు బిగిసి బయటపడలేకపోతుంది. అంతర్జాతీయ స్థాయిని, సినిమా దృక్పథాన్ని వదిలేసి పరిశీలించినా, జాతీయస్థాయిలో తెలుగు సినిమా పరిస్థితి నిరాశాజనకంగానే వుందని చెప్పాలి. భారతీయ సినిమాలపై విధించే ‘‘ఆంక్షలు-నిషేధాలు, కళాకారులు- కాపీరైట్ చట్టాలు’’ లాంటి వ్యాసాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ‘‘ఇరాన్‌లో పిల్లల సినిమాలు, భారతీయ బాలల సినిమా, తెలుగులో పిల్లలకోసం సినిమాలు మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తాం. సమాచారాత్మకంగానే కాకుండా ఈ వ్యాసాలు మనల్ని ఆలోచింపజేస్తాయి కూడా.
*

- కె.పి.అశోక్‌కుమార్