AADIVAVRAM - Others

బ్యాటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాటరీలు చాలా ముఖ్యమైనవి. కారులో బ్యాటరీ లేకపోతే కారు నడువదు.
లాప్‌టాప్ పరిస్థితి సెల్‌ఫోన్ పరిస్థితి అంతే.
అవి పని చేయాలంటే బ్యాటరీలు మంచిగా వుండాలి. అవి చార్జింగ్‌లో ఉండాలి. చార్జింగ్ లేకపోయినా అవి పనిచేయవు. అవి పనిచేస్తే మనకి ఎంతో ఉపయోగపడతాయి.
బ్యాటరీ లేకపోయినా, వాటిని ఉపయోగించుకునే వ్యక్తులు లేకపోయినా అవి నిరుపయోగంగా మారిపోతాయి. వాటి ప్రతిభ శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమై పోతాయి.
అలాగే కొంతకాలం గడిస్తే అవి పనికిరాకుండా పోతాయి.
మనుషులు వేరు.
వారి బ్యాటరీలను వేరేవాళ్లు చార్జి చేయాల్సిన అవసరం లేదు.
ప్రతి వ్యక్తిలో కొన్ని ప్రత్యేకమైన టాలెంట్స్ ఉంటాయి. ఇతరుల్లో లేనివి కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రతిభా పాటవాలు ప్రతి వ్యక్తిలో వుంటాయి.
బ్యాటరీ లేనట్టుగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తే ఆ వ్యక్తి కూడా నిరుపయోగంగా మారిపోతాడు.
వాళ్లకి ఉన్న ప్రతిభా పాటవాలతో వాళ్లు కొన్ని అద్భుతమైన పనులు చేయగలరు. కానీ అలా చేయకుండా వుండిపోతారు.
ఎక్కడో, ఎప్పుడో జరిగిన అపజయం, అవమానం వాళ్లని వెంటాడుతూ వుంటాయి. దాని వల్ల వాళ్లు తమలోని బ్యాటరీని పక్కన పడేసి ఎవరికీ ఉపయోగపడకుండా నిర్వాపకంగా ఉండిపోతారు. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని పాడుచేసుకుంటూ ఉంటారు.
మరి కొంతమంది వాళ్ల ప్రజ్ఞా పాటవాలు తెలుసు. కానీ ఉపయోగించరు.
మనిషికి వస్తువులకి వున్న భేదం - మనిషి తనను తాను చార్జి చేసుకోవాలి.
వస్తువులని ఇతరులు చార్జి చేయాలి.
మరి కొంతమంది వ్యక్తులు ఇతరులు ఎంత ప్రోత్సహించినా వాళ్లు తమ ప్రజ్ఞాపాటవాలని ఉపయోగించుకోరు.
మనం మనిషిలా మనలని మనం చార్జి చేసుకొని పరిగెడుదామా? లేక వస్తువుల్లాగా ఎవరైనా చార్జి చెయ్యాలని ఎదురుచూద్దామా?
ఇది మన చేతిలోనే ఉంది.
మరెవరి చేతిలో లేదు.

- జింబో 94404 83001