Others
మట్టి దేహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 April 2018
- ఆర్. బాలకృష్ణ, 9440143488

పిడికెడు మట్టిని తీసుకొని
స్నానించాను
దేహం కొత్త పరిమళాలు
వెదజల్లుతోంది
చెమటను శ్వాసించిన మట్టి
కొత్త పూల చెట్లను
వికసింపజేస్తోంది
దేహం
కొత్త పూల వెలుగులో
ప్రకాశిస్తోంది
నెత్తిపై కొత్త చెట్లు
మొలకెత్తాయ
రకరకాల కాయలు, పళ్లు
విరగకాస్తున్నాయ
దేహం మట్టిని
తయారుచేసే కర్మాగారమైంది
ఇప్పుడు - దేహానికి, మట్టికి
తేడా లేకుండాపోయంది.