నేర్చుకుందాం

నీలి నీలిగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చ కామెర్లు పాత కవిత
ఇవాళ లోకమంతా
నీలి కామెర్లు
నీలి సముద్రంగా
అలలెత్తి బుసకొడుతున్న
ఒక ఆటల ప్రపంచం
విరిగిన చెక్క పడవలై
అలల మీద తేలుతున్న
పసి-డి సీతాకోకలు
ఏ పరాయి గాలి
మోసుకొచ్చిన
విషపు నీలి మేఘమో
నెత్తురు చుక్కల వానయి
బాల్యాన్ని తడిపేస్తోంది
హాయి గొలిపే
మూలాల ఆటల ఆటకెక్కాయి
సోయి మరచి
పెయిని బుగ్గిపాలు చేసుకునే
వికృత క్రీడలతో
యువ ప్రపంచాలు
నీలి నీలి కన్నీటి అలల మీద
చచ్చిన చేపలై తేలుతున్నాయి
ఇప్పుడు ఆటంటే
నిండు జీవితాన్ని కబళించే వేట
ఇవాళ బతుకులతో
ఆటలాడుకోవడమే
ఎవరిని వాళ్లు స్వయంగా
వేటాడుకోవటమే
ఇవాళ గెలుపు కోసం
మరణించటమంటే
దేశం కోసమో రాజ్యం కోసమో
పేదవాళ్ల ఆకలి కోసమో
ఒక పోరాట యోధుడు
ముక్కలుగా తెగిపడటం కాదు
ఎవరి కోసం వాళ్లు

తెలియని ఒక పిచ్చితనంలో
పులి బోనులా తెరుచుకున్న
ఒక ‘ఆట’విక రింగులోకి
నిరాయుధుల్లా దూకి
గుడ్డిగా ఆత్మహననం చేసుకోవటం
నీలి సందేశాల
తుఫాను గాలిలో చిక్కి
చివురుటాకులా వణికిపోవటం
కన్నీటితో కళ్లాపి చల్లుకుని
నెత్తుటి చారలతో ముగ్గేసుకుని
క్రీడాస్ఫూర్తిని బలిపీఠమెక్కించటం
ఆరోగ్యకరమైన ఆటల మైదానాలను
సునామీలా చుట్టుముట్టిన
ఒక నీలి సముద్రం
రేపటి ప్రపంచమీద
తిమింగలమై దాడి చేసింది
అన్ని ఆటల్ని మింగేసిన ఆ తిమింగలం
మన లేలేత కలల ప్రపంచాన్ని
నెత్తుటి చుక్కలుగా
కత్తిరిస్తోంది
ఇప్పుడు
దేశమంతా నీలినీలిగా! *

-చిత్తలూరి సత్యనారాయణ 8247432521