Others

భవిష్యత్ స్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుజ్జాయి చిన్నారి బోజ్జకు గోరుముద్దలు తినిపించాలి
నీ వెచ్చని వడిలో లాలించి, బుజ్జగించి,
అమ్మతనపు కమ్మదనం రంగరించి-
నాకేదైనా ‘ఉవ్వాయి’ వస్తుందేమోనని,
పక్వాన్నం వండి, నెయ్యి, సూపము మిళితంగా వాత్సల్యాలు కలగలిపి-
‘‘ఈ చిరుతడే నా జీవిత సర్వస్వం
ఈ బుడతడే నా భవిష్యత్ స్వప్నం’’ అని
నునుమెత్తని నా శరీరం తుష్టిగా పుష్టిగా
ఎదగాలని ప్రతినిముషం తల్లడిల్లావు!
నీవుకాక ఎవరికుంది? గుండెనిండా ఓర్పు నింపుకున్న క్షమయాధరిత్రివి!
నా బోసినోటీ నుండి అస్పష్టమైన ఏవో మాటలు- వాటికే వ్యాఖ్యానాలు చెపుతూ,
నావరాల తండ్రి ముద్దులు మూటకట్టే ముద్దుముద్దు పలుకులు ‘‘అమ్మ, అత్త, తాత’’
అంటున్నాడండీ; ‘కలకండ పలుకులు పలకాలి’-
తేనెతో పసచాది నా నాలుక రసగ్రంథులు, అక్షర ప్రకంటపనలై,
చిన్నిచిన్ని పలుకులు నేర్పిన నా ప్రప్రథమ గురువువు నీవే తల్లీ!
పలుకులకు పంచదార చిలుకలు పంచి ‘‘నా వేయి నోముల పంట వీడే’’ అంటూ
గడపగడపకు గడ కట్టి ప్రకటించిన చదువుల తల్లీ!
నీకివే నా నమోవాకాలు !

బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు బాపట్ల, 9346911199