Others

హిందు అనే పద ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఉన్న మతములన్నింటిలోను హిందూ మతం చాలా పురాతనమైనది. ఈ మతమునే ఎక్కువమంది ప్రజలు అనుసరిస్తారు. వీరినే హిందువులని వ్యవహరిస్తారు. హిందువు అనే పదము ఎప్పుడు, ఏ విధంగా ఉద్భవించింది? అనుకొంటే ఈ పదము వేదాలలోగాని, ఉపనిషత్తులలోగాని, పురాణములలోగాని, మత గ్రంథములలో కాని కనిపించదు. త్రేతాయుగము నాటి రామాయణంలో గాని, సుమారు 5250 సం.ల నాటి ద్వాపర యుగంలోని భాగవతం, మహాభారతం, భగవద్గీతలోకాని కనిపించదు. ఈ దేశము ఒకానొకప్పుడు భరతునిచే పాలించబడినది. అందువలన ఈ దేశమును భరతవర్షం, భరతఖండంగా వ్యవహరించుచున్నారు. గాంధర్వ దేశం (అప్ఘనిస్తాన్), తూర్పు దేశం. దక్షిణంగా వింధ్య పర్వతాలు దాటిన ప్రజలని ఆర్యులని, వారి ధర్మం సనాతన ధర్మంగా వ్యవహరిస్తారు. ఆ కాలంలో ఆర్యులలో సురులు, అసురులు అనే రెండు తెగలు ఏర్పడినవి. వారి మధ్య జరిగిన యుద్ధాలలో అసురులు ఓడిపోయి, సింధూనది ప్రాంతాలనుండి, వాయువ్య దిశగా పారిపోయి ఇరాన్ అనబడే పర్షియా దేశంలో స్థిరపడినారు. ఇరాన్ అంటే ఆర్యుల దేశం అని అర్థము. వారి మత గ్రంథం అయిన ‘జెంద్ అవెస్థా’లో వారు ప్రయాణం చేసిన స్థలముల పేర్లు రాశారు.
పారశీకులు, భారతదేశ ఆర్యుల మధ్య పోలికలు- పర్షియాలో స్థిరపడిన పారశీకులు, మన దేశంలో ఆర్యులమధ్య అనేక పోలికలు ఉన్నాయి. ‘జెంద్ అవెస్తా’ ఋగ్‌వేదం గురించి చెప్పినది. భారతదేశంలోని ఆర్యులవలె, పారశీకులలోనూ నాలుగు వర్ణాలు వుండేవి. అవి- పురోహితులు, క్షత్రియుల, వైశ్యులు, వ్యవసాయదారులు. వారు కూడా అగ్ని, మిత్ర (సూర్యుడు) వాయువులని ఆరాధించేవారు. వారికి ఉపనయనం వంటి సంస్కారాలు వుండేది. దేవతలు అసురులను, రాక్షసులుగా వర్ణించారు. పారశీకుల నాయకుడు జరాద్యీప్ట (జోరాద్రీష్ట)సురులని రాక్షసులుగా వర్ణించాడు. పారశీకులలో అసుర అనే పదము గౌరవనీయమైన పదం. ఇంద్రుడిని రాక్షసుడిగా స్ర్తిలోలుడిగా, సురాపానం చేసేవాడిగా వర్ణించారు. అసురులు మొదటిలో సురాపానం చేసేవారు కాదు.
పాతకాలపు పర్షియన్ భాష సంస్కృతం నుండి వచ్చిన భాషగా వ్యవహరించవచ్చు. ఉదాహరణకి-
సంస్కృతం పారశీకం
పిత పితర్ (తండ్రి)
ఆస్‌మాన్ అసెమాన్ (ఆకాశం)
పుత్ర పుత్ర (కొడుకు)
ప్రళయ ప్రలెయ (ప్రళయ)
యజ్ఞ యస్న
ఆర్య ఐర్య
పారశీకులకు క్రమేణా ‘స’ అను అక్షరం పలకడం కష్టమై ‘స’ను ‘హ’గా పలికేవారు.
ఉదాహరణకి- సరయు నదికి హరయ అని, సప్త హప్త, సరస్వతి నదికి హరహతి, మనస్ మనహ్ అని, సర్పకి హేర్య అని, సేనకి హైన- క్రీస్తుపూర్వం 550 నుండి 230 కాలంలో ఉత్తర వాయువ్య భారతదేశం పారశీకులు క్రిందకి వచ్చినది. అపుడు వారు సింధూనదిని హిందూగా మార్చి పలికినారు. తర్వాత అలెగ్జాండర్ 330 క్రీ.పూ. ఆ ప్రాంతాలన్నీ జయించాడు. అపుడు అతను హిందూ అనే మాటని ప్రాంతాన్ని వర్ణించేమాటగా వ్యవహరించాడు. ఆ తర్వాత ముస్లిములలో పాలనలో ‘హిందు’ మత సంబంధితమైన మాటగా మారింది. ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనలో రుూ దేశం ఇండియాగా మారి, ఇక్కడి ప్రజలు ఇండియన్స్‌గా మారారు. కాని, ఇప్పుడు కూడా హిందువులు వాళ్ళ మత సంబంధమైన పూజలతో, దేశ కాల వర్తనలో ‘్భరత వర్షే భరత ఖండే, మేరో దక్షిణ దిక్‌భాగే’ అనే చెపుతారు. మనం మన దేశాన్ని భారత దేశం అని, మనని మనం భారతీయులమని చెప్పుకొనుట బాగా వుంటుంది. హిందూ అనే పదం పారశీకుల ద్వారా వచ్చిన మాట అని చెప్పవచ్చు.

-కె.ఆర్.బెనర్జీ