Others

ఆలోచనల్లో నుంచి కాల్పనికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు తరగతి గదిలో 48న76, 46న78.. ఈ రెండింటిలో ఏది పెద్దది అని గుణించకుండా చెప్పాలని ప్రశ్న వేశాను. అది నాకు, విద్యార్థులకు ఇద్దరికీ వేసుకున్న ప్రశ్న. నేనేం చేశానంటే?.. ఎన్‌ఏ+బి, ఎన్‌సి+బి అనగా ఆ అంకెల్లో వున్న నిర్మాణాన్ని కనిపెట్టాను. దానివల్ల నాకు ఎబి+బి, ఎబి+ఇడి యొక్క తారతమ్యాన్ని కనుగొనుటకై రెండు స్టెప్స్ వేసి ఎ-బి, బి-ఇ ఈజ్ లెస్‌దేన్ జీరో. అనగా ఏ ఈజ్ లెస్ దెన్ బి అనగా 4 సంఖ్య అనేది 7 సంఖ్య కన్నా చిన్నది. రెండవ పక్కన ఉన్న 4 సంఖ్య 7 సంఖ్య కన్నా చిన్నది. ఒక పక్కన పదుల స్థానంలో ఉన్న 7, రెండవ పక్కన ఉన్న 4 కన్న పెద్దది కాబట్టి ఒక పక్కన వున్న 8 కన్నా రెండవ పక్కన ఉన్న 6 కంటే పెద్దది. కాబట్టి 48న76 పెద్దది అని నిర్థారణకు వచ్చాను.
ఒక విద్యార్థి లేచి ఏమన్నాడంటే?.. 48న76 కదా.. ఒకటి 46న78 కదా. 46న78 తోటి ఒక దీర్ఘ చతురస్త్రం గీయమన్నాడు. 78 పొడవులో రెండు తక్కువ చేస్తే 76 వస్తుంది కదా. 46లో రెండు ఎక్కువ చేస్తే 48 వస్తుంది కదా. అని ఆ విద్యార్థి చెప్పాడు. నేను ఆ లెక్కకు చెప్పింది 6 స్టెప్స్. కానీ ఆ విద్యార్థి లెక్క చేసింది రెండు స్టెప్స్‌లోనే. నేను చేసింది లాజికల్ స్టెప్స్. విద్యార్థి చేసింది క్రియేటివ్ థింకింగ్. ఆ లెక్కకు దీర్ఘచతురస్రాకారం అనుకోవటం, పొడవు, వెడల్పులను ఎక్కువ చేయటం ఆ విద్యార్థి క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్‌లో పిల్లల ఆలోచనలున్నాయి. ఉపాధ్యాయుని ఆలోచనలో పుస్తకాల జ్ఞానం ఇమిడి ఉంది. కాల్పనిక శక్తి అన్నది విద్యార్థికి ఆ క్షణంలో జనించిన ఆలోచనల నుంచి వచ్చింది. విద్యార్థికి గ్రంథపరిచయం లేదు. ఆ క్షణంలో గుణకారం అంటే దాన్ని దీర్ఘచతురస్రాకారం అనుకోవటం. ఆ వైశాల్యాలను పోల్చి ఏది ఎక్కువో ఏది తక్కువో విద్యార్థి చెబుతున్నాడు. క్రియేటివ్ థింకింగ్ విద్యార్థి ఆలోచనల్లో నుంచి జనించింది. అది ఏ పుస్తకంలోనూ ఉండదు. తరగతి గదిలో టీచర్ ఆలోచనల కన్నా విద్యార్థులు సులభమైన పద్ధతుల్లో ఆలోచించటం వెలుగు చూస్తుంది. ఇది ఆచరణాత్మకంగా వెలుగు చూసింది.
తరగతి గది కొత్త ఆలోచనల గుట్ట. డెన్‌జైన్ నిర్మాణాన్ని ఒక విద్యార్థి కనుక్కున్నాడు. ఆ తర్వాత రాత్రికి ఆ విద్యార్థి కలలో దాని గురించి ఆలోచించాడు. తరగతి గది చదువు కలలుగా మారింది. కఠినమైన పద్యాలతో నన్నయ చెప్పగలిగితే- అదే భావాలను ఒక గ్రామీణ విద్యార్థి తన సులువైన పదాలతో ఆటపాటల మీద చెప్పాడు. నన్నయ బతికుంటే ఆ విద్యార్థిని ఎంత ముద్దు చేసేవాడో? కాల్పనిక ఆలోచన పాండిత్యంతో రాదు. ఆ క్షణంలో ఆకస్మికంగా ఆ విద్యార్థి ఆలోచన బైటకు వస్తుంది. తరగతి గది కొత్త ఆలోచనలతో జలపాతంగా ప్రవహిస్తుంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీల యజమానులు తరగతి గదిలో విద్యార్థులిచ్చిన కాల్పనిక భావనలు పట్టుకుని కొత్త ఆవిష్కరణలు చేస్తారు. అది ఏ పుస్తకం లేకుండా వచ్చినటువంటి భావన. చాలామంది సినిమా డైరెక్టర్లు స్కూల్ డే జరుగుతున్నపుడు కూర్చుంటారు. పిల్లలు కాల్పనిక శక్తితో కొత్త నటన చూపిస్తారు. ఆ పిల్లల కాల్పనిక శక్తిని సినిమాలో తెస్తే ఆ సినిమాకు అదే హిట్టుగా, జీవికగా మారుతుంది. కాల్పనిక శక్తిని తరగతి గదిలో ప్రోత్సహించగలిగితే, దాన్ని రికార్డు చేయగలిగితే మేలు జరుగుతుంది. ఏనాడు ఏ తరగతిలో కొత్త భావనలు జనించాయి? అవి ఏ విద్యార్థుల నుంచి పొందగలిగామో? వంటివి చెప్పాలి. ఉద్యోగ విరమణ నాడు ఉపాధ్యాయుడు తన అనుభవాల పాఠాలను ఒక పుస్తకంగా రికార్డు చేసి ఇవ్వగలిగితే రాబోయే తరగతి గదికి వంతెన అవుతుంది.
అది తల్లిప్రేమ..
సృజనాత్మక, సున్నితమైన ఆలోచన ఈ రెండు కూడా తరగతి గదికి విడదీయలేని అంగాలు. ఈ రెండింటిలో తేడా ఉన్నా, కొన్నిసార్లు సృజనాత్మకమైన ఆలోచన అన్నది సున్నితంగా ఆలోచించటం (క్రిటికల్ థింకింగ్)గా దోహదపడవచ్చు. సున్నితమైన ఆలోచనే సృజనాత్మకమైన అంశానికి దోహదపడవచ్చు.
పాండిత్యం వల్ల శ్రీశ్రీ ప్రజాకవి అయ్యాడా? ప్రజాకవి కావటం వల్ల పండితుడయ్యాడా? ఒక పరిజ్ఞానం అంటే శ్రీశ్రీకున్న పాండిత్యమే ప్రజలకు ధారపోశాడు. అదే మాదిరి గద్దర్, కానూరి వెంకటేశ్వరరావులు గొప్ప కళాకారులు. ఆ స్వరం డప్పు దరువుకి, డోలక్ మోతకి, గజ్జెల సవ్వడికి దోహదపడలేదా? గద్దర్ గొప్ప కళాకారుడు. క్రియేటివ్ థింకింగ్‌కు శాస్ర్తియత ఉండదనటం అంత సరైంది కాదేమో? అదే మాదిరి సైంటిస్ట్‌లు పరిశోధన చేస్తున్నపుడు అకస్మాత్తుగా కొత్త ఆవిష్కరణకు దోహదపడుతుంది.
క్రిములపై పరిశోధన చేస్తున్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్‌కు పెన్సులిన్ ఇంజక్షన్ అకస్మాత్తుగా దొరకలేదా? మనిషిలో క్రిములను నాశనం చేయటం కోసం పరిశోధన చేస్తూ చేస్తూ ఆయన ‘పెన్సులిన్’ మందును కనుక్కున్నాడు. క్రియేటివ్ థింకింగ్ యాధృచ్చికమే కావచ్చు. దాని వెనుక శాస్ర్తియ దృక్పథం పరోక్షంగా కనిపిస్తుంది. తరగతి గదిలో మనకు యాధృచ్ఛికంగా విద్యార్థిలో క్రియేటివ్ థింకింగ్ కనిపిస్తుంది. ఆ విద్యార్థే శాస్త్ర పరిశోధనలు చేసి సున్నితమైన అంశాన్ని కూడా కనుక్కోవచ్చు. తరగతి గది విద్యార్థిలో కనపడే క్రియేటివ్ థింకింగ్ (కాల్పనిక శక్తి) నుంచి శాస్ర్తియ ఆసక్తి మొలకెత్తవచ్చు. కొన్నిసార్లు చెట్టు ఔషధానికి పనికివస్తుంది. తరగతి గది ఈ మొలకలకు నీరు పోస్తుంది. విద్యార్థి అనుకోకుండానే ఒక క్రియేటివ్ థింకింగ్‌కు కారణభూతుడౌతాడు. తరగతి విద్యార్థిని ఒక సైంటిస్టుగా మార్చేస్తుంది. తరగతి గది మొక్కలు పెంచే నర్సరీ. ఏ విద్యార్థి రామానుజన్‌లా గణిత శాస్తవ్రేత్త అవుతాడో చెప్పలేం. తరగతి గది తన కాల్పనిక శక్తి ఉన్న ప్రతి విద్యార్థి రామానుజన్ కావాలని కాంక్షిస్తుంది. తరగతి గదిది మాతృప్రేమ. క్రిటికల్ థింకింగ్ నుంచి మొలిచే అన్ని మొక్కలనూ తరగతి గది పెంచుతుంది.

-చుక్కా రామయ్య