Others

ఎట్టకేలకు కలయిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ సింగపూర్‌లో భేటీ కావడం చారిత్రాత్మకం. వారు కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడి ఉంటారని ఒక ఊహ...
ట్రంప్ : కిమ్.. వెల్కమ్!
కిమ్ : ట్రంప్... కమ్.. కమ్!
ఇలా కలుసుకోవడం ఆనంద దాయకం.
ట్రంప్ : ఆ ఏముందీ, ఇదో విధాయకం. అయినా నీకెందుకు ఇంత బింకం? ఆయుధాలు తగ్గించడం ఆవశ్యకం.
కిమ్ : నీ ముఖం.. నీదే దొంగ నాటకం. మేము తగ్గిస్తే, నువ్వు చేస్తావా ఆయుధాల అమ్మకం?
ట్రంప్ : బాగుందీ నీ వాలకం. ప్రపంచ శాంతికి నువ్వే ఆటంకం.
కిమ్ : అన్నిచోట్లా అరాచకానికి నువ్వే అసలు కారకం. అదేగా నీ వ్యాపకం. మా శత్రువులకు నువ్వే సహాయకం.
ట్రంప్ : నీ మీదే అపనమ్మకం. ముందు అణ్వాయుధాలు ఆపేస్తే చేస్తా నీతో వర్తకం. తగ్గిస్తా మీ బీదరికం.
కిమ్ : చాలు మీ పెద్దరికం. ఆర్థిక ఆంక్షలు సడలించు ముందు. అదే కీలకం. లిబియా కథ మేం మరిచిపోలేని జ్ఞాపకం.
(ఇలా మాటలు సాగుతుండగా మీడియా వాళ్లంతా వచ్చేశారు. ఇద్దరూ కలిసి నవ్వుతూ కెమెరాలకు పోజులిచ్చారు. అలా కిమ్, ట్రంప్ మీటింగ్ ముగిసింది.)

- డా. డి.వి.జి.శంకరరావు