మెయిన్ ఫీచర్

వ్యవసాయ సంబంధ పర్వం -- ఏరువాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ధర్మాలు, ప్రజల కేంద్రస్థానమై, అఖండ మరియు అవిభాజ్యమైన సంస్కృతికి మూలాధారమైన భారతావని ప్రాచీన కాలంనుండీ వ్యవసాయ ప్రధాన దేశం కావడం, గ్రామీణులలో అధిక సంఖ్యాకులు రైతులే కావడం, ఎడ్లు మరియు నాగళ్ళతో విడదీయరాని బంధం, అనుబంధాన్ని ఏర్పరచుకోవడం మన దేశానికే ప్రత్యేకం. ఆంధ్ర దీపికా నిఘంటువును బట్టి ‘‘ఏరు’’ అనగా సర్వావయవములు గల నాగలికి ఎడ్లను పూనినది అని అర్థం. ‘‘ఏరు’’ ఎద్దులను గట్టి దున్నుటకు సిద్ధపరిచిన నాగలి అని శబ్దరత్నాకార నిఘంటువు స్పష్టం చేస్తున్నది. ‘‘ఏరువాక’’ అంటే దున్నుటకు ఆరంభమని అర్థం. అనగాదుక్కి యొక్క ప్రారంభం. వర్షరుతువు ఆరంభ దశలో రైతులు ఆచరించే పండుగగా భావించ బడుతున్నది. వర్షాలు కురిసి భూమి పదునైనచో (పురస్వసు కార్తెలో) పునాస విత్తనాలు వేయడం పరిపాటి. పునర్వసు నుండే పునాస పదం ఏర్పడినట్లు చెపుతారు. పునర్వసు కార్తెలో పునాస విత్తనాలు వేయడం సనాతన సాంప్రదాయం. జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అంటారు. ఈ నాడు ఎద్దులకు మైకడిగి, కొమ్ములకు రంగులు వేసి, గజ్జెలు, గంటలు, అద్దము, కుచ్చులు మెడకు కట్టి అలంకరించే ఆచారం అనాదిగా ఆచరణలో ఉంది. పొద్దుననే పొంగలి (పులగం) చేసి, ఎద్దులకు పెట్టి, వాటిని వేసే గాడికి ధూపదీప నివేదనమొర్చి, తమ జీవిత సర్వస్వాలైన ఎద్దులకు కృతజ్ఞత తెలుపుకునే వేడుకే ‘‘వృషభోత్సవం’’. దీనిని గురించి ‘అనడుత్సవం’ పేరుతో అధర్వణ వేదంలో వివరించ బడింది. కన్నడిగులు కారుణి పబ్బమంటారు. ఏరువాక పౌర్ణమిని సంస్కృతములో ఉద్యృషభ యజ్ఞం అంటారు. ఔత్తరాహికులు వృషభ యజ్ఞం చేయడం ఆచారమై ఉంది. దీని విధి నిషేధికము శ్రౌత సూత్రమున కలదు. ఇది తొలుత హలకర్మము. అంకురారోపణమనే విప్రుల కర్మ సంబంధంగా పారాశర, బోధాయనాది గృహ్య సూత్రములలో పేర్కొనబడింది. వ్యవసాయం బ్రాహ్మణులు చేయుట మానిన తర్వాత అమంత్రకముగా ఆచరించడం ప్రారంభమైనదిగా భావించ బడుతున్నది. ఇందుకు సంబంధించి ఏరువాక, నాగలి పాటలు, సినీ సాహిత్యంలోనూ ప్రత్యేక ప్రస్తావనాంశాలుగా ఉన్నాయి. పారస్కరుడు తన గృహ సూత్రాలలో...హలకర్మకు జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలు మంచివని పేర్కొన్నాడు. ఈనాడు ఓషధీపతియైన చంద్రుడు హలకర్మకు మంచి నక్షత్రమైన జ్యేష్ఠకు దగ్గరగా ఉంటాడు. వ్యవసాయ దారులు ఈరోజున ఎవ్వరికీ అప్పులు, బదుళ్ళు ఇవ్వరు. డబ్బులు పెట్టి ఏమీ కొనరు. ‘‘బండలు పగిలే భరణి కార్తె, రోళ్ళు పగిలే రోహిణి కార్తె ఎండలు వెనకబడి, మృగశిర కార్తెతో ముంగిళ్ళు’’ చల్ల బడతాయి. ఆ పైన ఆరుద్ర వాన అదనపు వాన. ఇది వ్యవసాయానికి అనువైన కాలం. రోహిణిలో విత్తనాలు చల్లితే రోళ్ళు నిండని అల్పపు పంట అని రైతులకు అనుభవ పునరుక్త అంశం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494