Others

ఇలా చేసి చూడండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు క్లీనింగ్ అంటే ఇంట్లో అందరికీ పెద్ద పనిగా భావిస్తారు. అందులో ఉద్యోగినులు అయిన స్ర్తిలు మరింత ఇబ్బందిగా ఆలోచిస్తారు. కాని క్లీనింగ్‌లోనూ చిట్కాలు తెలుసుకొంటే చిక్కేలేకుండా క్లీనింగ్ చేసేయొచ్చు.
పొద్దుపొద్దునే్న ముఖం చూసుకొనే అద్దం , వాష్ బేసిన్ దగ్గర ఉండే అద్దం ప్రతిరోజు క్లీన్ చేస్తేనే మన ముఖం అందాన్ని చూపెడుతుంది. దీనికోసం పాతపేపర్ ముక్కను తీసుకొని దానిపై అప్పుడప్పుడు రుద్దుతుంటే పైన నుంచి కిందకు కాని, కిందనుంచి పైకి కానీ రుద్దితే అద్దం తళతళలాడుతుంది. దానిపై నీళ్లచుక్కల వల్ల ఏర్పడే చుక్కలు మటుమాయం అవుతాయి.
వాష్‌బేసిన్ లో ఉండే కుళాయి (ట్యాప్) కూడా చుక్కచుక్కలుగానోలేక మట్టి కొట్టుకుపోయో ఉంటూ ఉంటుంది. ఇలాంటి కుళాయిలను వాడేసిన నిమ్మతొక్కలను రుద్ది ఆపై గినె్నలు తోముకునే పొడితో రుద్దితే చాలు కొత్త కుళాయిల్లాగా మెరుస్తుంటాయి.
సిలెండర్ కింద మచ్చలుగాని, ఏదైనా ఒక వస్తువును ఒకే చోట పెట్టినప్పుడు నేలపైన ఏర్పడే మచ్చలను కూడా కాస్తంత నిమ్మరసం గాని, వాడేసిన నిమ్మతొక్కలను కాని రుద్ది తడిగుడ్డతో తుడిచేస్తే చాలు ఆ మచ్చలు మరకలు మటుమాయం అవుతాయి.
సోఫాలమీద కుర్చీల మీద అప్పుడప్పుడు పాలో, టీనో ఒరిగిపోయి మచ్చలుగా ఏర్పడుతుంటాయి. అలాంటివాటిని అప్పటికప్పుడే తడిగుడ్డతో తుడిచేస్తే ఆ మరకలు పోతాయి. ఒక్కోసారి అపుడు వీలు కాకపోతే అవి మరకగా కనిపిస్తుంటాయి. అట్లాంటి వాటిపైన కూడా నిమ్మచెక్కలను రుద్ది కాసేపు ఆగాక బట్టలుతుక్కునే సబ్బుతో రుద్ది తడిగుడ్డతో తుడిచేస్తే ఆ మరకలు మాయం.
కొన్ని సార్లు కడాయి లేక బాణలి అడుగుభాగం బాగా నల్లగా మాడి పోతుంది. అటువంటి నలుపుదనాన్ని నిమ్మచెక్కతో రుద్దడం వల్ల నలుపు పోగొట్టవచ్చు. అంతకన్నా త్వరగా ఆ నలుపు పోగొట్టాలనుకొంటే ట్లాబ్లెట్స్ ఉన్న స్విలర్ రేపర్‌తో బాగా గట్టిగా రుద్దితే నలుపు పోయి బాణలి తెల్లగా కొత్తదానిలాగా కనపడుతుంది.
*