Others

నా మాతృభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను పుట్టిన ఊరు నా మాతృభూమి
చిన్ననాడు వదిలి వచ్చేశాను
మనసు భారం అనిపించలేదు
కన్నీరు రాలేదు
పైగా ఆనందం వేసింది
కొత్తప్రదేశానికి వెళ్లానని
అపుడు మనసు ఎదగలేదు

ఇపుడు
వయసు పెరిగింది
మనసూ ఎదిగింది
సంసారమూ మొదలైంది
ఆకస్మాత్తుగా నా మాతృభూమిని
చూడాలనిపించింది

చాలా ఏళ్ల తరువాత
నేను వెనుదిరిగాను
నా గడ్ట పై కాలిడాను
నా గుండె బరువెక్కింది
నేను పుట్టిన ఇల్లు నేలమట్టం
నేను చిన్నతనంలో ఆడుకున్న ప్రదేశాలు
పిచ్చిమొక్కలతో కారడవిలా ఉంది
నాతో ఆడుకున్న నా నేస్తాలు
మనసు స్ఫురణకు తెచ్చింది
వారూ లేరు
బహుశా... వాళ్లూ నాలాగే
వలస పక్షులేమో...

అయినా నేను వచ్చాను
నా జన్మభూమిని సుశ్యామలం చేస్తాను
కన్నతల్లి, నేలతల్లి సంతోషించేలా
నేను వ్యవహరిస్తాను
నిర్ణయించుకున్నాను
పలుగు పార పట్టాను
కదం తొక్కితే పదం పడాల్సిందేగా
ఇపుడు
నా కన్నతల్లి కంట సంతోషపు పొర
నా నేలతల్లి కంట పచ్చదనపుపంట
నా హృదయం ఆనందమయం

కొండవలస క్రిష్టమూర్తి రాయగడ, ఒడిషా